S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/29/2016 - 01:21

హైదరాబాద్, మార్చి 28: హెచ్‌సియూ వైస్ ఛాన్సలర్ అప్పారావు ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన విద్యార్థులు, ప్రొఫెసర్లకు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ నెల 22న విసి అప్పారావు రెండు నెలల సెలవు తరువాత మళ్లీ విధుల్లో చేరడానికి వచ్చిన సందర్భంగా 25 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు విసి ఇంటిపై దాడికి పాల్పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

03/29/2016 - 01:14

హైదరాబాద్, మార్చి 28: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.

03/29/2016 - 01:12

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపామని, అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి హరీశ్‌రావు శాసనసభకు వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గతంలో లారీ ఇసుక రూ. 35 వేలుంటే, ఇప్పుడు రూ.11వేలు ఉందన్నారు. ఇసుక పాలసీ ద్వారా తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు.

03/29/2016 - 01:10

హైదరాబాద్, మార్చి 28: కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 3న జరగాల్సిన రాత పరీక్ష 24న జరుగుతుందని, అయితే ఎస్సై పరీక్ష మాత్రం యథాతథంగా జరుగుతుందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. తెలంగాణ పోలీస్ శాఖలోని 9281 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 3న జరగాల్సిన రాత పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే.

03/29/2016 - 01:08

హైదరాబాద్, మార్చి 28: ఈ ఏడాది నుంచి కాళోజి వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోనే మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నట్టు వైద్య, ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి వెల్లడించారు.

03/29/2016 - 00:57

విజయవాడ, మార్చి 28: జూన్ కల్లా విజయవాడకు తరలి రావల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులు తమ పక్షాన కొన్న ప్రతిపాదనలు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఉద్యోగ సంఘ నాయకులతో మున్సిపల్ మంత్రి నారాయణ సోమవారం చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘ నాయకులు చేసిన ప్రతిపాదనలు, డిమాండ్లను విన్న మంత్రి నారాయణ వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని, తిరిగి ఏప్రిల్ 2న సమావేశమవుదామని వారికి చెప్పారు.

03/29/2016 - 05:07

ఏలూరు, మార్చి 28: తెలుగుజాతికి వెలుగు పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని, ఈ బృహత్తర ప్రాజెక్టుపై కేంద్ర సహకారంతో ముందుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతి నీటిచుక్కను సాగునీటిగా మార్చటంతోపాటు ఉద్యమస్ఫూర్తితో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

03/29/2016 - 04:14

హైదరాబాద్, మార్చి 28: తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులనుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తక్షణం కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. మిట్టమధ్యాహ్నం వేళ పొలాల్లో కూలీల చేత పని చేయించరాదని ఆదేశించింది.

03/29/2016 - 00:51

హైదరాబాద్, మార్చి 28: అగ్రిగోల్డ్ సంస్థ కార్యక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సిబిఐ చేత విచారణ చేయించాలని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై సోమవారం జరిగిన చర్చలో పాల్గొంటూ, దాదాపు40 లక్షల మంది 6850 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేశారని, వీటిపై వడ్డీతో కలిపి మొత్తం 10 వేల కోట్ల రూపాయలు అవుతుందన్నారు.

03/28/2016 - 04:32

తిరుమల, మార్చి 27: వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం తిరుమలలో రద్దీ కొనసాగింది. ఉదయం 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో సర్వదర్శనం భక్తులకు 11 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగినప్పటికీ అటు తరువాత సాధారణ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో భక్తులకు క్యూలైన్లలో అందుతున్న సౌకర్యాలను తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు స్వయంగా పరిశీలించారు.

Pages