S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/06/2020 - 01:08

హైదరాబాద్, ఫిబ్రవరి 5: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో వివిధ అభివృద్ధి పనులకు రూ.6,846 కోట్లు మంజూరు చేసిందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం గజానన్ పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/05/2020 - 05:57

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం భారత కాఫీ బోర్డు కార్యదర్శి, సీఈవో శ్రీవత్స కృష్ణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాఫీ తోటల అభివృద్ధి, ఎగుమతులపై కొద్దిసేపు చర్చించారు.

02/05/2020 - 05:55

విజయవాడ, ఫిబ్రవరి 4: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు - భీమవరం టౌన్ స్టేషన్ల మధ్య 16కి.మీ డబ్లింగ్ రైలు మార్గం రైళ్ల రాకపోకలకు రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదం పొందింది. ఈ డబ్లింగ్ మార్గంలో మొదట రైలు నెం 17482 తిరుపతి - బిలాస్‌పూర్ విజయవంతంగా నడిపారు.

02/05/2020 - 05:27

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సినీరంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునతో సమావేశమయ్యారు. ఈ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు మంత్రి తలసాని తెలిపారు.

02/05/2020 - 05:26

హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం గిరిజన సాంస్కృతిక బృందాల నృత్యహేల కన్నుల పండువగా జరిగింది. న్యూఢిల్లీలో గత నెల 26 న భారత గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్న గిరిజన సాంస్కృతిక బృందాలు గవర్నర్ తమిళిసైని కలిశాయి. 26 మంది కోయ, గోండు, బంజారా, తోటి, ప్రధాన్, డోలి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

,
02/05/2020 - 01:11

కాట్రేనికోన: ఉప్పూడి గ్రామం ఊపిరి పీల్చుకుంది. రెండు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గ్యాస్ బ్లోఅవుట్ మంగళవారం ఉదయం అదుపులోకి వచ్చింది. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో కేఎఫ్‌హెచ్ చమురు సంస్థ నిర్వహణలో ఉన్న ఒక రిగ్ నుండి ఆదివారం సాయంత్రం నుంచి భారీగా గ్యాస్ లీకవుతూ భయానక వాతావరణం రేకెత్తించిన సంగతి తెలిసిందే.

02/05/2020 - 05:29

అమరావతి: ప్రముఖ విద్యుత్‌రంగ నిపుణులు, ఉమ్మడి రాష్ట్రం లో ఏపీఎస్‌ఈబీ మాజీ చైర్మన్ కే బలరామరెడ్డి (91) మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌రంగ అభివృద్ధికి కృషి చేశారు. వి ద్యుత్‌రంగ సంస్కరణలు, అమల్లో క్రియాశీల పాత్ర పోషించారు.

02/04/2020 - 06:47

అమరావతి: ఆంధ్ర సబ్‌ఏరియా మేజర్ జనరల్ ఆర్‌కే సింగ్ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్నిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర సబ్‌ఏరియాకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మేజర్ జనరల్ సింగ్‌ను బొబ్బిలి వీణ, శాలువతో సీఎస్ సత్కరించారు. కార్యక్రమంలో కమాండర్ బీవీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.

02/04/2020 - 06:27

తిరుపతి, ఫిబ్రవరి 3: తిరుమలలో ఫిబ్రవరి 9వ తేదీన పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

02/04/2020 - 05:54

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: ఏపీ సీఎం జగన్ ఉండగానే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ పీఠాన్ని సందర్శించారు. సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం జగన్ తిరుగుప్రయాణమయ్యారు. అనంతరం గవర్నర్ తమిళిసై పీఠం ఆవరణలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్రను కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు.

Pages