S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/27/2016 - 01:03

హైదరాబాద్, ఫిబ్రవరి 26: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకుడు కన్హయ్య కుమార్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న న్యాయవాదులు బిజెపికి చెందిన వారేనని పేర్కొంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ఫోటోలను విడుదల చేశారు.

02/27/2016 - 01:03

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రిక్రూట్‌మెంట్‌కు ఇంత వరకూ 5,64,431 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్ధులు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. అభ్యర్ధుల ఆధార్ నెంబర్లను సేకరిస్తున్నామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడే సందర్భాల్లో కఠినంగా శిక్షించేందుకు దీనివల్ల కుదురుతుందని చెప్పారు.

02/27/2016 - 01:02

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: కొత్త ఇసుక విధానం సృష్టించిన గందరగోళం కారణంగా నిర్మాణ రంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించటంతో రాష్ట్రంలో ఇక ఇసుక కష్టాలు తీరతాయనుకున్న నిర్మాణ రంగం ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇ వేలం నిర్వహించినా ఇంత వరకు కొత్త విధానంలో ఒక్క రీచ్ కూడా తెరుకోకపోవటంతో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది.

02/27/2016 - 01:01

హన్వాడ, ఫిబ్రవరి 26: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల గ్రామంలోని శివాలయంలో 18వ శతాబ్ధం నాటి పురాతన నంది విగ్రహం చోరీకి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున భక్తులు దేవాలయానికి వెళ్లి స్వామివారికి దర్శించుకునేందుకు గుడి తలుపులు తెరిచి చూడగా గుడిలోని నంది విగ్రహం లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

02/27/2016 - 01:01

హిందూపురం, ఫిబ్రవరి 26: శిల్పకళలకు పేరుగాంచిన అనంతపురం జిల్లా లేపాక్షికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవతో రూ.4.62 కోట్లు ఖర్చుచేసి లేపాక్షి పరిసరాలను అభివృద్ధి చేశారు. శని, ఆదివారం రెండు రోజులపాటు లేపాక్షి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

02/27/2016 - 01:00

హైదరాబాద్, ఫిబ్రవరి 26: వేసవికాలం ఆరంభంలోనే ఫిబ్రవరి నెలలో మండుటెండలు మొదలైనా, తెలంగాణలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే వాతావరణం చల్లబడిందని హైదరాబాద్‌లోని వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకుడు నర్సింహారావు తెలిపారు. మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ రాష్ట్రం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆయన చెప్పారు.

02/27/2016 - 00:59

హైదరాబాద్, ఫిబ్రవరి 26: సినీ నటి స్వాతిరెడ్డి అదృశ్యమైందంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తన కుమార్తె మూడు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లిందని, ఇంతవరకూ తిరిగి రాలేదని స్వాతిరెడ్డి తల్లి నాగేంద్రమ్మ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఒంగోలుకు చెందిన స్వాతిరెడ్డి అలియాస్ తనూష మూడు సినిమాల్లో నటించింది.

02/27/2016 - 00:59

కర్నూలు, ఫిబ్రవరి 26: తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, దేవగుడి నారాయణరెడ్డి, జయరాములు, జలీల్‌ఖాన్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

02/27/2016 - 00:58

విజయవాడ, ఫిబ్రవరి 26: దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా జీవిత ఇతివృత్తంతో ‘వంగవీటి’ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైన దర్శకుడు రాంగోపాల్‌వర్మ భారీ బందోబస్తు మధ్య శుక్రవారం సాయంత్రం నగరంలో హల్‌చల్ చేశారు. వర్మను అడ్డుకునేందుకు రంగా అభిమానులు తరలివస్తున్నారనే ప్రచారంతో నగర డిసిపి కాళిదాసు రంగారావు ఆధ్వర్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బందోబస్తు ఏర్పాటైంది.

02/27/2016 - 00:58

అమరావతి, ఫిబ్రవరి 26: గుంటూరు జిల్లా అమరావతి మండల పరిధిలోని మల్లాది గ్రామానికి చెందిన భవిరిశెట్టి కోటేశ్వరరావు తన పొలంలో చిలకడదుంపల సాగు చేశారు. శుక్రవారం చిలగడదుంపలు తవ్వుతుండగా 9.5 కేజీల బరువు గల చిలకడదుంప బయటపడింది. ఈ వార్త అమరావతిలో దావానలంగా వ్యాపించడంతో పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చి భారీ చిలగడదుంపను ఆసక్తిగా తిలకించారు.

Pages