S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/16/2016 - 02:45

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విపక్షంలో ఉన్న వైకాపా హింసను కోరుకుంటోందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. జగన్ అభివృద్ధి నిరోధకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఇన్నర్ రోడ్డు విషయంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని, వైకాపా ఎమ్మెల్యేలతో నిరాహారదీక్షకు జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

02/16/2016 - 02:44

హైదరాబాద్, ఫిబ్రవరి 15: టిడిపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి, రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వైకాపా అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందువల్ల మంత్రులంతా ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

02/16/2016 - 02:43

విజయవాడ, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న ఇసుక డిమాండ్‌ను దృష్టిలో వుంచుకుని రోబో ఇసుక తయారీకి పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సహించేందుకు ఇసుక విధానంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం నాడిక్కడ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కె అచ్చన్నాయుడు, పీతల సుజాత పాల్గొన్నారు.

02/16/2016 - 02:43

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన వైసిపి ఎమ్మెల్యే రోజా తన సస్పెన్షన్ అక్రమమంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. గత ఏడాది శాసనసభ సమావేశాల్లో అనుచితంగా మాట్లాడారన్న అభియోగంపై ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రోజా హైకోర్టును ఆశ్రయించారు.

02/16/2016 - 02:42

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ నియమాకానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో చెప్పాలని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ భోసలే, జస్టిస్ నవీన్‌రావులతో కూడిన బెంచ్ ఆదేశించింది.

02/16/2016 - 02:42

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : విశాఖపట్నంలో కనె్వన్షన్ సెంటర్ నిర్మించేందుకు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయానికి చెందిన 10 ఎకరాల భూమిని లీజుపై ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఏటా 96,80,000 రూపాయల అద్దె చెల్లించే ప్రాతిపదికపై ఎపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి భూమిని అందచేసేందుకు వీలుగా దేవాదాయ కమిషనర్‌కు ప్రభుత్వం అధికారం కల్పించింది.

02/16/2016 - 02:16

గుంటూరు, ఫిబ్రవరి 15: ఆసియా ఖండంలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు భారీ ఎత్తున మిర్చిబస్తాలను తీసుకొచ్చారు. సోమవారం ఒక్కరోజే లక్షా 21వేల 254 బస్తాలను రైతులు యార్డుకు తరలించారు. మిర్చి ధర ఆశాజనకంగా ఉండటంతో కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చిని రైతులు అమ్మకానికి పెద్దఎత్తున యార్డుకు తీసుకొచ్చారు.

02/16/2016 - 02:15

గుంటూరు, ఫిబ్రవరి 15: జాలర్లు ఆధునికతను సంతరించుకుని అభివృద్ధి బాటలో పయనించాలని అఖిల భారత క్షత్రియ సంఘం అధ్యక్షుడు డా. గజేంద్ర భాన్జీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సోమవారం పర్యటించిన జాలర్ల కుటుంబాలను కలిశారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో జాలర్లతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల నిధులను జాలర్ల అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు.

02/16/2016 - 01:20

హైదరాబాద్/కర్నూలు, ఫిబ్రవరి 15: సియాచిన్ మంచుకొండల ప్రమాదంలో అమరుడైన వీర సైనికుడు ముస్తాఖ్ అహ్మద్ భౌతికకాయం సోమవారం అర్థరాత్రి ఆయన స్వగ్రామమైన కర్నూలు జిల్లా పార్నపల్లికి చేరుకుంది. అహ్మద్ భౌతికకాయానికి మంగళవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. తొలుత వీర జవాన్ భౌతిక కాయం ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది.

02/16/2016 - 01:20

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ నగరంలో ఎన్‌ఆర్‌ఐల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని ఎల్‌బినగర్‌లో శ్రవణ్ కుమార్ అనే యువకుడు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సంప్రదించి వరంగల్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానులతో ఘనంగా వివాహం జరిపించారు.

Pages