S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/29/2016 - 14:05

కోల్‌కతా : కోల్‌కతాలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన విప్రో కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేశారు. వీరు బ్రిటన్‌కు చెందిన టాక్‌టాక్ సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో వీరిని అరెస్టు చేశారు. వీరు కోల్‌కతాకు చెందినవారు.

01/29/2016 - 14:03

ఆదిలాబాద్ : జిల్లాలోని జైపూర్ మండలం బీమారం వద్ద ఆటో టిప్పర్ ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటో చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు చెన్నూరువాసులుగా గుర్తించారు.

01/29/2016 - 07:31

మంగళగిరి, జనవరి 28: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి జిల్లాల్లోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని 29 గ్రామాల్లో భూ సమీకరణ కింద సిఆర్‌డిఎ తీసుకున్న పంటపొలాలన్నీ నేడు బీడుభూములుగా దర్శన మిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో సమీకరణకు భూములిచ్చిన రైతులు కౌలు పరిహారం తీసుకుని పొలాలను పంటలు వేయకుండా వదిలేయడంతో కంపచెట్లు పెరిగి బీడుభూములుగా మారాయి.

01/29/2016 - 07:20

హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత డిజిటల్ యుగంలో కాలయాపనకు అవకాశం లేకుండా సినిమాలకు ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ (సెన్సార్‌షిప్) ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు సూచించారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సభ్యులుగా నియమితులైన వారికి వర్క్‌షాప్ సందర్భంగా నగరంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

01/29/2016 - 07:12

విశాఖపట్నం, జనవరి 28: విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల నాలుగునుంచి ప్రారంభమయ్యే ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా ఏడవ తేదీన జరగనున్న ప్రధాన విన్యాసాలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

01/29/2016 - 07:10

కాకినాడ, జనవరి 28: ఎపి ఎంసెట్-2016కు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ గుర్తింపుసంఖ్య కలిగివుండాలని, లేని పక్షంలో ప్రవేశ పరీక్షకు అనుమతించేది లేదని ఎపి ఎంసెట్-2916 కన్వీనర్ ఆచార్య సిహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. ఎపి ఎంసెట్ నోటిఫికేషన్‌ను శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి జారీచేయనున్నట్టు ఆయన చెప్పారు.

01/29/2016 - 06:33

కంచికచర్ల, జనవరి 28: ఊర కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన కామా వెంకటేశ్వర్లు, వెంకట రమణ దంపతుల కుమార్తె అనన్య (3) ఉదయం ఆరుబయట ఆడుకుంటుండగా ఊర కుక్కలు మెడపట్టుకొని పొలాల్లోకి ఈడ్చుకు వెళ్లాయి.

01/28/2016 - 18:33

హైదరాబాద్‌ : తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చందానగర్‌లో జరగిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ ఆదాయాన్ని పెంచాను కాబట్టే.. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

01/28/2016 - 18:32

విజయవాడ : రైతుల నుంచి 28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, తొలివిడతగా రూ. 200 కోట్లు విడుదల చేశామని, వారం రోజుల్లోగా మిగతా నిధులు విడుదల చేస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రంగా ఓ చోట కొబ్బరి పార్కును నిర్మిస్తామని పేర్కొన్నారు.

01/28/2016 - 18:25

గుంటూరు :మహిళలకు సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం వచ్చేలా కృషి చేస్తానని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ నాకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Pages