S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/26/2016 - 00:51

హైదరాబాద్, జనవరి 25 : ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల) చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సిపిఎంజి) గా డాక్టర్ వైపి రాయ్ సోమవారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. చత్తీస్‌గఢ్ సిపిఎంజిగా పనిచేస్తున్న రాయ్‌ను తెలంగాణ-ఎపి రాష్ట్రాలకు సిపిఎంజిగా బదీలి చేయడంతో ఆయన హైదరాబాద్‌లోని సిపిఎంజి కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.

01/26/2016 - 00:50

హైదరాబాద్, జనవరి 25: అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నేరుగా డిగ్రీలో చేరేందుకు అర్హత పరీక్షను ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ఇంటర్ చదవని వారు సైతం 18 ఏళ్ల ప్రాయం నేరుగా ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై డిగ్రీలో చేరవచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా అభ్యర్ధులు తమ దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తులు పంపించుకునేందుకు మార్చి 15 చివరి తేదీ, పరీక్ష ఏప్రిల్ 17న జరుగుతుంది.

01/26/2016 - 00:50

హైదరాబాద్, జనవరి 25: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను సక్రమంగా అమలు చేయడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

01/26/2016 - 00:49

హైదరాబాద్/గచ్చిబౌలి/శంషాబాద్, జనవరి 25: ఉద్యోగాల పేరుతో నకిలీ వీసాలు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టులు, వీసాలు తయారుచేసి గల్ఫ్ దేశాలకు మేల్ సర్వెంట్ పేరుతో మనుషులను రవాణా చేస్తున్న ఎనిమిది మంది ఏజెంట్లతోపాటు ఒక ఇమిగ్రేషన్ అధికారిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

01/26/2016 - 00:49

హైదరాబాద్, జనవరి 25 : 67 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అటు విజయవాడలో, ఇటు హైదరాబాద్‌లో మంగళవారం జాతీయ పతాకావిష్కరణ చేస్తున్నారు. ఇందుకోసం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి.

01/26/2016 - 00:49

‘పద్మశ్రీ’పై డా.నాయుడమ్మ

01/26/2016 - 00:48

రామానుజ తాతాచార్య

01/26/2016 - 00:47

‘పద్మభూషణ్ పురస్కారం’పై యార్లగడ్డ

01/26/2016 - 00:46

హైదరాబాద్, జనవరి 25: వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ శాఖలో రూ.3.13 కోట్ల నిధులను దుర్వినియోగం, స్వాహా చేయడం వంటి అభియోగాలనపై ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో తెలిపింది.

01/26/2016 - 00:45

హైదరాబాద్, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించే వేడుకలకు సోమవారం త్రివిధ దళాలతో పాటు పలు విభాగాల పోలీసులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ రిహార్సల్స్ అలరించింది. ఈ వేడుకలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితోపాటు అదనపు సిపి అంజనీకుమార్, ట్రాఫిక్ కమిషనర్ జితేందర్ పర్యవేక్షించారు.

Pages