S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/26/2016 - 00:30

హైదరాబాద్, జనవరి 25: ప్రతిష్ఠాత్మక గ్రేటర్ ఎన్నికల ప్రచార ఘట్టాన్ని వేడెక్కించేందుకు సిఎం కె చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఎలా తీర్చిదిద్దాలన్న అంశాలపై బహిరంగ సభ, మీడియా భేటీలో వివరించాల్సిన విషయాలను కెసిఆర్ సోమవారం పార్టీ ముఖ్యులతో క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచార తీరు, పార్టీ పరిస్థితి ఎలాఉందనే దానిపైనా సమీక్ష జరిపారు.

01/26/2016 - 00:29

భద్రాచలం, జనవరి 25: మావోయిస్టు పార్టీకి ఒడిశా రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దియోఘర్ జిల్లా అడవుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యుడు, కళింగ డివిజన్ కార్యదర్శి పుట్టపాక కుమారస్వామి అలియాస్ సుశీల్ అలియాస్ బసంత్ అలియాస్ రంజిత్ అలియాస్ వీరన్న, అతని భార్య సింద్రీ లింగో అలియాస్ సోనీ అలియాస్ రోమా హతమయ్యారు.

01/26/2016 - 00:28

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ యోచిస్తోంది. పరీక్షల సంస్కరణలపై గత కొద్ది నెలలుగా లోతైన అధ్యయనం చేస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ అధ్యక్షతన 8మంది విద్యా నిపుణలతో దీనిపై కమిటీని నియమించింది.

01/26/2016 - 00:22

400 మందికి రిపబ్లిక్ డే కానుక

01/26/2016 - 00:19

హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఆందోళన మరింత తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా 27న అన్ని వర్శిటీలు బంద్ పాటించాలని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. దీంతో ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి విద్యార్థుల ఆందోళన అంశం తలనొప్పిగా మారుతోంది.

01/25/2016 - 13:48

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియాపై దేశద్రోహం కేసు నమోదైంది. పాకిస్థాన్‌పై 1971లో జరిగిన యుద్ధానికి సంబంధించి ఆమె పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెను అరెస్టు చేయాలంటూ ఢాకాలోని మెట్రోపాలిటన్‌ కోర్టులో కేసు నమోదైంది.

01/25/2016 - 13:12

హైదరాబాద్ : హెచ్‌సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన దీక్ష ఇంకా కొనసాగుతోంది. సోమవారం క్యాంపస్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.

01/25/2016 - 02:22

నర్సీపట్నం, జనవరి 24: విశాఖ మన్యంలో గత నాలుగు రోజులుగా చలితీవ్రత మళ్ళీ అధికమైంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో మన్యంతో పాటు మైదానంలో సైతం చలి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల నుండే చలిగాలులు వీస్తుండడంతో పాటు వర్షంలా మంచుకురుస్తోంది. ఆదివారం ఉదయం లంబసింగిలో నాలుగు డిగ్రీలు, చింతపల్లిలో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

01/25/2016 - 02:21

తిరుమల, జనవరి 24: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన పవిత్ర తీర్థాల ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో ప్రముఖమైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు పాపవినాశనం డ్యాం చెంత అన్నప్రసాదం పంపిణీ చేశారు.

01/25/2016 - 02:21

సూళ్లూరుపేట, జనవరి 24: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘావర్గాలు హెచ్చరించడంతో ప్రధాన నగరాలతో సహా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం (సతీష్ థావన్ స్పేష్ సెంటర్) షార్‌లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో సహా పోలీసులు, కోస్టల్ గార్డులచే సముద్ర మార్గాన కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Pages