S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/06/2016 - 08:15

విజయవాడ (క్రైం), జనవరి 5: విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమ ఆస్తులు కలిగిన భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. విజయవాడలో పని చేస్తున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు కొల్లూరి రామ సుబ్బారావు ఇంటిపై మంగళవారం దాడులు నిర్వహించారు. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతోపాటు విజయవాడలోనూ చర స్థిర ఆస్తులను కొనుగొన్నారు.

01/06/2016 - 08:14

నందిగామ, జనవరి 5: రైతుల ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చి ముందు చూపుతో పంట కుంటలు (పంట సంజీవని) నిర్మించుకుంటే కరవును జయించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.

01/06/2016 - 08:14

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బాధ్యతను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. నిజాయితీగా, తొందరగా, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నియామకాలు చేసేందుకు వీలుకలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో డి.ఎస్సీ నియామకాల్లో జిల్లాల వారీ జాబితాలు తయారుచేయడానికే 20రోజుల నుండి రెండు నెలల వ్యవధి పట్టిన సందర్భాలున్నాయి.

01/06/2016 - 07:49

గుంటూరు, జనవరి 5: రాజధాని నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, గ్రామకంఠాల రూపురేఖలపై ప్రజలకు స్పష్టత రావటంతో ఎక్స్‌ప్రెస్ హైవేలపై నిర్మాణం వలన జరిగే నష్టంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తుళ్లూరు ప్రజలు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణాల వలన ఎన్ని ఇళ్లు తొలిగించాల్సి వస్తుందనే భయాందోళనలో ఉన్న విషయం తెలిసిందే.

01/06/2016 - 07:48

తిరుపతి, జనవరి 5 : రాష్ట్ర శాసన సభ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే విధంగా చర్చలు జరిగి చట్టాలు రూపొందించడంతో పాటు రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వేదిక కావాలని శాసనసభ సభాపతి కోడెల శివప్రసాద్ అన్నారు.

01/06/2016 - 07:48

విశాఖపట్నం, జనవరి 5: రాష్ట్రంలో పాలకపక్షం తీరు ఘోరంగా ఉందని, ఇదే సమయంలో ప్రభుత్వంపై పోరాటంలో విపక్షం పూర్తిగా విఫలమైందని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఒకరోజు శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు మంగళవారం విశాఖ వచ్చిన ఆయన మాట్లాడుతూ పాలన మొత్తం ఏకపక్షంగా సాగుతోందన్నారు.

01/06/2016 - 07:47

కడప, జనవరి 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల వద్దకే అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, అయితే కడపజిల్లాలో చాలామంది అధికారులు నిర్లక్ష్యధోరణిలో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన రాయచోటి, కడప నియోజకవర్గాల్లో జన్మభూమి -మా ఊరు కార్యక్రమాలకు హాజరయ్యారు.

01/06/2016 - 07:46

విజయవాడ, జనవరి 5: మగవారికి దీటుగా మహిళలను కుటుంబ పోషణలో భాగస్వాముల్ని చేయటమే గాక పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్న మాటలకు, చేతలకు ఎంతో వ్యత్యాసం కన్పిస్తోంది.

01/06/2016 - 07:46

బొల్లాపల్లి, జనవరి 5: ఓ మహిళకు మొదటి కాన్పులో నలుగురు శిశువులు జన్మనిచ్చిన సంఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలోని నెహ్రునగర్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన సుజాత బాయి కాన్పు కోసం వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరగా తొలి కాన్పులోనే నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు.

01/06/2016 - 07:39

విజయవాడ, జనవరి 5: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పాటైన కాపు కమిషన్‌కు చైర్మన్‌గా నియమితులైన కృష్ణాజిల్లా కైకలూరు వాసి చలమలశెట్టి రామానుజయ్యతోపాటు డైరక్టర్లుగా యర్రా వేణుగోపాలరాయుడు (రాజమండ్రి), యర్రా నవీన్ (తాడేపల్లిగూడెం), వడ్డెల్ల సాంబశివరావు (నందిగామ), నారాపుశెట్టి పాపారావు (దర్శి), వెదుర్ల రామచంద్రరావు (నంద్యాల), కంఠా మురళీమోహన్ రాయల (అనంతపురం), మోదుగుల పెంచలయ్య (రాజంపేట) మంగళవారం నాడిక్కడ ప

Pages