S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/06/2016 - 07:38

హైదరాబాద్, జనవరి 5: సంక్రాంతి సందర్భంగా బెట్టింగ్‌లతో కూడిన కోడి పందేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తిలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించింది.

01/06/2016 - 07:35

హైదరాబాద్, జనవరి 5: కాపు సామాజిక వర్గం త్వరలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసే ప్రయత్నాలను తిప్పిగొడతామని మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. కాపుల సభను జరగనివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు జాతి తిరగబడితే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని, ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

01/06/2016 - 05:57

విజయవాడ, జనవరి 5: రానున్న సిఐఐ సదస్సును లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బలమైన బాటలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తయారీ రంగం, ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దే విధంగా ఈ సదస్సును ఉపయోగించుకోవాలన్నారు. ఈ నెల పది నుంచి మూడు రోజుల పాటు విశాఖలో జరపతలపెట్టిన సిఐఐ 22వ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష జరిపారు.

01/06/2016 - 05:55

విజయవాడ, జనవరి 5: ఐదుగురి ప్రాణాలు బలిగొన్న కల్తీ మద్యం వ్యవహారంలో 9వ నిందితుడిగా ఉన్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి మంగళవారం లబ్బీపేటలోని తన ఇంటికి చేరుకున్నారు.

01/06/2016 - 05:51

హైదరాబాద్, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కనీసం రెండేళ్లపాటు ప్రాథమిక మిషన్‌ను మరీ ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధారం చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత వివిధ కారణాల వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారీ ఎత్తున కొనసాగించేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

01/06/2016 - 05:00

హైదరాబాద్, జనవరి 5: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ఇంటికి వెళ్లి ఆయనతో గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రస్తుతం దాసరి నారాయణరావు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా, క్రియాశీలకంగా లేకపోవడంతో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. వైఎస్ కుటుంబానికి, తమ కుటుంబానికి మధ్య అనుబంధం చాలా సంవత్సరాల నుంచి ఉందని మీడియాతో దాసరి అన్నారు.

01/06/2016 - 04:55

హైదరాబాద్, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి విద్యార్థి నుంచి పది రూపాయిలు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో విద్యార్థుల నుండి కూడా ప్రభుత్వం వసూళ్లకు పాల్పడితే ఎలా? అని విపక్షాలు మండిపడుతుండగా, రాజధాని నిర్మాణంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని తప్పుపట్టడం ఏ విధంగానూ సరికాదని టిడిపి నేతలు పేర్కొంటున్నారు.

01/06/2016 - 04:18

ఒంగోలు, జనవరి 5: నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేమార్గం పరిధిలో ప్రకాశం జిల్లాలోని ఎనిమిది మండలాల్లో భూసేకరణ కోసం సర్వే పూర్తయిందని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/05/2016 - 18:32

హైదరాబాద్‌: అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందన్న వార్త కలకలం సృష్టించింది. దీంతో రైల్వే అధికారులు అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది.

01/05/2016 - 16:53

హైదరాబాద్ :సంక్రాంతికి ఏటా నిర్వహించే కోడి పందాలపై మంగళ వారం హైకోర్టులో విచారణ జరిగింది. పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను హై కోర్టు విచారణకు స్వీకరించింది. వీటి పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.

Pages