S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/05/2016 - 16:02

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేడు నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంలో భాగంగా రేవంత్‌రెడ్డి రాష్ట్ర పంచాయతీరార్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాదుల ఆరోపణ.

01/05/2016 - 15:50

పుల్కల్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం గొగులూరు గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు మంజీరా పరివాహక ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లారు. వాళ్లలో శివకుమార్ అనే వ్యక్తి.. కాళ్లు కడుక్కోడానికి నీళ్లలోకి దిగగా, వెంటనే మొసళ్లు అతడిపై దాడిచేసి, లోపలకు లాక్కెళ్లిపోయాయి. శివకుమార్‌ను రక్షించేందుకు రామస్వామి అనే మరో కాపరి చిన్న తెప్పతో లోనికి వెళ్లి.. గాలించడం మొదలుపెట్టాడు.

01/05/2016 - 15:49

వరంగల్ : వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసకుంది. మౌనిక స్వస్థలం హైదరాబాద్. ఆమె మృతికి కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

01/05/2016 - 15:47

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ టెస్టు (సెట్) తేదీలు ఖరారయ్యాయి. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్ పాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు సెట్‌ల తేదీలను ప్రకటించారు. మే 2న ఎంసెట్, మే 12న ఈసెట్, మే 19న ఐసెట్, మే 27న ఎడ్‌సెట్, మే 24న లాసెట్, పీజీ లాసెట్, మే 11న పీఈసెట్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.

01/05/2016 - 15:44

భూపాలపల్లి(వరంగల్) : 2018 నుంచి రాష్ట్ర మంతా 24గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు. మంగళవారం గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ను ఆయన జాతికిఅంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏటా రూ25 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్ట్ ల అభివృద్ధికి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

01/05/2016 - 13:14

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా 1,069 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారి గ్రేడ్-2 విభాగంలో వెయ్యి పోస్టులు, భూగర్భ జలశాఖలో 69 పోస్టులతోపాటు మరిన్ని ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి.

01/05/2016 - 12:58

హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీలో మంచంగిపుట్ట మండలం సరియాపల్లిలో ఇన్‌ఫార్మర్‌ నెపంతో శివయ్య అనే గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.

01/05/2016 - 07:42

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార పక్షానికి ఒక రకంగా, ప్రతిపక్షానికి మరో రకంగా ప్రొసీడింగ్స్ అందజేసి వివక్ష చూపిందని వైకాపా ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

01/05/2016 - 07:19

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 4: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. హోమగుండంలో దుర్గగుడి ఇవో దంపతులు సిహెచ్ నరసింగరావు, విజయలక్ష్మి దంపతులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.

01/05/2016 - 07:17

తుళ్లూరు, జనవరి 4: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిర్వహణ తీరుపై గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం, వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో 13లక్షల రూపాయల వంతున సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ఆయన ప్రారంభించారు.

Pages