S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/04/2016 - 08:44

కాకినాడ, జనవరి 3: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పోర్టుకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన భూములు ట్యాంపరింగ్ అయినట్టు తెలుస్తోంది. పోర్టుకు సంబంధించి 17 సర్వే నెంబర్ల పరిధిలో విలువైన భూములను కొందరు కబ్జాదారులు ట్యాంపరింగ్ చేసి, ఆక్రమించుకున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ అక్రమాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

01/04/2016 - 08:41

విశాఖపట్నం, జనవరి 3: రాష్ట్రంలో సాంకేతిక విప్లవం రాబోతోందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన అమలు కానుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖల మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. విశాఖ శివారు మధురవాడలోని ఐటి కంపెనీల ప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు.

01/04/2016 - 08:31

తిరుమల, జనవరి 3: తిరుమలలో లడ్డూ దళారీని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
చిత్తూరుకు చెందిన సురేష్ అనే దళారి లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు అధిక ధరలకు లడ్డూలను విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 30 శ్రీవారి లడ్డూలతో పాటు 40 లడ్డూ టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు.

01/04/2016 - 08:12

హైదరాబాద్, జనవరి 3 : న్యాయవిద్యతోపాటు అన్ని విద్యాసంస్థల్లో పోటీతత్త్వం వల్ల విద్యార్థులు, అభ్యర్థులలో ప్రతిభ పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రయ్య అన్నారు. సికింద్రాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడమీలో ఆదివారం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్‌మెడల్స్, జస్టిస్ టిహెచ్‌బి చలపతి మెమోరియల్ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

01/04/2016 - 08:12

విజయవాడ (క్రైం), జనవరి 3: ఆర్ధిక ఇబ్బందులతో కడు పేదరికంలో మగ్గుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు బ్రోకర్లు ఎదురు పెట్టుబడులు పెట్టి ఉపాధి పేరుతో గల్ఫ్ దేశాలకు తరలించి వ్యభిచార వృత్తికి అమ్ముకుంటున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు మధ్యవర్తుల బారిన పడి బెహ్రయిన్‌లో అడుగుపెట్టి అష్టకష్టాలు పడి తిండి తిప్పలు లేక శారీరక హింసకోర్చి..

01/04/2016 - 08:10

హైదరాబాద్, జనవరి 3: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలవడం చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. గ్రేటర్ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఆదివారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం జరిగింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి అవసరం అయిన ప్రణాళికలు రూపొందించామని, ఆ మేరకు అభివృద్ధి చేయాలంటే హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు.

01/04/2016 - 08:10

హైదరాబాద్, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఎపి గనులు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ స్పందనను చూసి ఓర్వలేక ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి నేతలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తోందని అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

01/04/2016 - 08:09

హైదరాబాద్, జనవరి 3: వివిధ శాఖల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న 120 మందికిపైగా అధికారులు, ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేసింది. ప్రభుత్వ నిధులు మళ్లింపు, అవినీతి, అవకతవకలు, నియమావళిని ఉల్లంఘించడం తదితర అభియోగాలపై అహర్నిశలు కష్టపడి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రభుత్వానికి ఆధారాలతో సహా నివేదికలు పంపుతూంటుంది.

01/04/2016 - 08:08

వెంకటాచలం, జనవరి 3: మానసిక వికలాంగులుగా పుట్టిన అభాగ్యులను సౌభాగ్యులుగా మార్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

01/04/2016 - 07:03

హైదరాబాద్, జనవరి 3: ఇప్పటి వరకు వైశాల్యంలో విస్తరిస్తూ వచ్చిన రాజధాని ఇకపై మరింత ‘ఎత్తు’ పెరుగనుంది. ఇప్పటి వరకు 18 మీటర్ల వరకు అంటే ఏడు, ఎనిమిది అంతస్తుల వరకు మాత్రమే భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారు. ఇకపై మరో నాలుగు అంతస్తుల వరకు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గృహ నిర్మాణానికి ఊతం ఇచ్చే విధంగా పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనుంది.

Pages