S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/02/2016 - 07:12

విశాఖపట్నం, జనవరి 1: విశాఖ నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ ఉత్సవ్-2016ను స్థానిక ఆర్‌కె బీచ్‌లోని ప్రధాన వేదిక మీద ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గంటా మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన నగరంగా విశాఖ గుర్తింపు పొందిందన్నారు.

01/02/2016 - 07:08

రాజమండ్రి, జనవరి 1: మార్కెట్లో నగదు రొటేషన్ లేకపోవటంతో దీని ప్రభావం నూతన సంవత్సర వేడుకలపై పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడలో కాల్‌మనీ దుర్మార్గాలు బయటపడిన తరువాత రాష్టవ్ట్రాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించిన నేపధ్యంలో వడ్డీ వ్యాపారులు బెంబేలెత్తిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా పోయాయి.

01/02/2016 - 06:49

హైదరాబాద్, జనవరి 1: అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు రెండు ముందుండాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాలు పరస్పరం సుహృద్భావంతో కలిసి మెలిసి అభివృద్ధిలో పోటి పడ్డాలన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాజభవన్‌లో గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

01/02/2016 - 06:47

హైదరాబాద్-ఖైరతాబాద్, జనవరి 1: అందంగా కన్పించిన గులాబి పూలను చూసి ముచ్చటపడి స్వామికి సమర్పించేందుకు సిద్ధపడిన ఓ అయ్యప్పభక్తుడికి అనుకోని కష్టం వచ్చిపడింది. కళ్లముందు కళకళలాడుతున్న పూలనుకోసి పూజకు ఉపయోగిద్దామనుకున్న ఆ ఉద్యోగికి భగవంతుడి అనుగ్రహం మాటేమోగాని తన పై అధాకారి అగ్రహానికి గురయ్యాడు.

01/02/2016 - 06:43

విజయవాడ, జనవరి 1: కంప్యూటర్, టివి వినియోగం ఎంత పెరిగినప్పటికీ మనసుకు ప్రశాంతత నిచ్చేందుకు పుస్తకం ఒక్కటే పెద్ద దిక్కు అని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. స్వరాజ్య మైదానంలో 27వ పుస్తక మహోత్సవాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

01/02/2016 - 06:04

తిరుమల, జనవరి 1: నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజున శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల సంఖ్య అంచనా వేసిన స్థాయికి చేరలేదు. జనవరి 1 శుక్రవారం ఉదయం 6 గంటల నుండి భక్తులను దర్శన నిమిత్తం ఆలయంలోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ప్రొటోకాల్ విఐపిలకు కల్పించే దర్శనాల సంఖ్యను, సమయాన్ని కూడా తగ్గించడంతో సామాన్య భక్తులను అరగంట ముందుగా 5.30 గంటలనే ఆలయంలోకి అనుమతించారు.

01/02/2016 - 06:03

హైదరాబాద్, జనవరి 1: రాష్ట్ర విద్యా వ్యవస్థ మీద విశే్లషాణాత్మక కథనాలు అందించిన పాత్రికేయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద ఉత్తమ వార్తా కథన పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

01/02/2016 - 06:00

హైదరాబాద్, జనవరి 1: గృహ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి శ్లాబ్‌లను ఎత్తివేసి గ్రూపుల విధానాన్ని అమలు చేస్తే వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంది. మూడు గ్రూపుల్లో అంతర్గతంగా శ్లాబ్‌లను చేర్చారు. డిస్కాంల ఖజానా గలగలలాడుతుంది. ఏపి డిస్కాంల ప్రతిపాదనల ప్రకారం గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీలుగా వినియోగదారులను వర్గీకరించారు.

01/02/2016 - 05:58

హైదరాబాద్, జనవరి 1: ఓట్ల కోసమే ఆంధ్ర సోదరులంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని తెలంగాణ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆంధ్ర వారిపై ద్వేషభావం ప్రదర్శించారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఆంధ్ర వంకతో బిసి జాబితానుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేరుస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

01/02/2016 - 02:27

ఏలూరు, జనవరి 1: వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు రాష్టస్థ్రాయి పథకాలకు సిఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆరోగ్య వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే పథకాలను నూతన ఏడాది రోజున ప్రారంభించారు. ప్రధానమైన ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

Pages