S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/23/2015 - 06:29

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించుకునేంత బలం లేదని తెలిసినా ఆ పార్టీ ధైర్యం చేసింది. అందునా అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి.

12/23/2015 - 06:28

హైదరాబాద్, డిసెంబర్ 22: విజయవాడ కల్తీ మద్యం ఘటనపై 9 మంది సీనియర్ అధికారులతో స్పెషల్ ఇన్విస్టిగేటింగ్ టీమ్ (సిట్)ను నియమించినట్టు అబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం నాడు శాసనసభలో వెల్లడించారు. 74వ నిబంధన కింద కల్తీ మద్యం అంశంపై పి శ్రీనివాసరెడ్డి , గద్దె రామమోహనరావు తదితరులు ఇచ్చిన నోటీసుకు మంత్రి బదులిచ్చారు.

12/23/2015 - 04:20

హైదరాబాద్, డిసెంబర్ 22: బాక్సైట్ నిక్షేపాల వెలికతీతలో వ్యక్తుల ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన జీవో (222)ను రద్దు చేస్తున్నట్టు సిఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలపై మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమ, భూగర్భ శాఖ మంత్రి పీతల సుజాత ప్రకటన చేశారు.

12/23/2015 - 04:18

హైదరాబాద్, డిసెంబర్ 22: ఇసుక ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, మంత్రివర్గ సమావేశంలో చర్చించి మెరుగైన నూతన ఇసుక విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఇసుక అక్రమ రవాణాపై మంత్రి పీతల సుజాత ప్రకటన చేశారు.

12/23/2015 - 04:17

హైదరాబాద్, డిసెంబర్ 22: వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన తర్వాత కూడా అసెంబ్లీలో మంగళవారం ఆమెపై చర్చ జరిగింది.
ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు మంగళవారం చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదనే అభియోగంతో వైకాపా బుధవారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.

12/23/2015 - 03:47

హైదరాబాద్, డిసెంబర్ 22: డిఎస్సీ- 2014లో స్థానికేతరుల కోటా వివాదంపై ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. 20 శాతం స్థానికేతర కోటాకు రాష్ట్రేతరులు కూడా అర్హులేనని ట్రిబ్యునల్ పేర్కొంది. స్థానికేతర కోటా రాష్ట్రంలోని 13 జిల్లాలకేనన్న ఆంధ్రప్రదేశ్ వాదనను ట్రిబ్యునల్ కొట్టివేసింది. స్థానికేతరుల కోటా రాష్ట్రానికే వర్తింపచేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.

12/22/2015 - 17:23

హైదరాబాద్‌: మెరుగైన ఇసుక విధానానికి శ్రీకారం చుడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో ఇసుక విధానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దూర ప్రాంతాలకు కూడా ఇసుక అందాల్సిన అవసరం ఉందన్నారు. ఇసుక రీచ్‌ల పర్యవేక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు మంత్రి పీతల సుజాత తెలిపారు.

12/22/2015 - 17:16

హైదరాబాద్:ప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాథ్ మరణించారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విశాఖపట్నం వెళ్తుండగా ఆయనకు ఖమ్మం సమీపంలో గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. కాశీ విశ్వనాథ్ మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

12/22/2015 - 13:54

హైదరాబాద్‌: గజదొంగ బాలమురుగన్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బాలమురుగన్‌ ముఠా ఐదు రాష్ట్రాల్లో బ్యాంకు దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.70లక్షల నగదు, రూ.కోటి విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

12/22/2015 - 13:51

మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో మంగళవారం గౌరీయాగం ప్రారంభమైంది. ఈ యాగానికి కేసీఆర్ దంపతులు హజరయ్యారు. అయితే బుధవారం ఉదయం 8.10 గంటలకు అయుత చండీయాగం ప్రారంభం కానుంది. ఈ యాగం ప్రారంభానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ బోంస్లే హజరుకానున్నారు. ఈ యాగం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.

Pages