S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/21/2015 - 16:45

హైదరాబాద్ : మంత్రులు కేటీఆర్, తలసాని సమక్షంలో కేఎం ప్రతాప్, కట్టెల శ్రీనివాస్, వీఎన్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరారు.

12/21/2015 - 16:44

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వాకౌట్ చేసింది పుట్టినరోజు జురుపుకొనేందుకా అని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. సభ నుండి రోజా సంతోషంగానే వెళ్లిపోయారని, రాజధాని ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

12/21/2015 - 16:43

హైదరాబాద్ : గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే గెస్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాల అధ్యాపకుల వేతనం రూ. 8,500, టీజీటీ, పీజీటీ, పీడీ విభాగాల అధ్యాపకుల వేతనం రూ. 7,500, పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ విభాగాల అధ్యాపకుల వేతనం రూ. 6,500, మ్యూజిక్ విభాగం అధ్యాపకుల వేతనం రూ. 6,500కు పెంచడం జరిగింది.

12/21/2015 - 14:28

హైదరాబాద్‌: అగ్రిగోల్‌ కేసు దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అరెస్టులు ఎందుకు చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. సీఐడీ దర్యాప్తుపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే దర్యాప్తు అధికారిని తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే తీరు కొనసాగితే తాము ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.

12/21/2015 - 14:11

జయదేవ్‌పూర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించతలపెట్టిన ఆయుత మహా చండీయాగం కార్యక్రమాలకు సోమవారం అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా యాగశాలల్లోకి వెళ్లిన కేసీఆర్‌ దంపతులు గురుప్రార్ధన, గణపతిపూజ, పుణ్యవచనం, దేవానంది, అంకురార్పణం, పంచగమ్య మేననం, గోపూజ, యాగశాల ప్రవేశం, సంస్కారం, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

12/21/2015 - 14:09

ఢిల్లీ : ఢిల్లీలో నానాటికీ అధికమవుతున్న పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీల కోసం కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటుచేసింది. ఈ బస్సులను పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

12/21/2015 - 08:00

విజయవాడ (క్రైం), డిసెంబర్ 28: తాను ఓ బాధితురాలినే తప్ప నిందితురాలిని మాత్రం కాదని, పోలీసులు తనపై ఎందుకు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారో తెలియడం లేదని సినీనటి తారాచౌదరి అలియాస్ రాజేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం నేరం చేశానని విజయవాడ పోలీసులు తనపై రౌడీషీటు, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అదే నిజమైతే తాను న్యాయపోరాటం చేస్తానంటూ ప్రకటించారు.

12/21/2015 - 07:53

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణలో త్వరలో జరిగే పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపును ఇస్తున్నట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. ఆదివారం ఆయన తన ఇద్దరు కుమారులతో హైదరాబాద్ నుంచి తాండూర్‌కు సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తన స్నేహితులను కలుసుకున్నారు.

12/21/2015 - 07:52

విజయవాడ, డిసెంబర్ 20: విజయవాడ కేంద్రంగా రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారాన్ని ఏఒక్కరూ కూడా రాజకీయ కోణంలో చూడరాదని బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జ్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. వడ్డీ సొమ్ము బకాయిదారులపై లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడిన వారందరిపై నిర్భయ చట్టం కింద తక్షణం కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

12/21/2015 - 07:51

హైదరాబాద్, డిసెంబర్ 20: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభా మర్యాదను ఏమాత్రం పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సభలో ఆయన వ్యవహారశైలి సక్రమంగా లేదని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Pages