S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/21/2015 - 07:50

కాకినాడ, డిసెంబర్ 20: కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియను డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గడువులోగా సెట్‌ఆప్ బాక్స్‌లను ఏర్పాటుచేసుకోని పక్షంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేయాలని స్పష్టం చేసింది.

12/21/2015 - 07:49

తిరుమల, డిసెంబర్ 20: తిరుమల జెఇఓ కార్యాలయానికి దారి ఎటు అని అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఎస్‌ఐ నాగేశ్వరరావు విజయవాడకు చెందిన ఫణికుమార్‌పై సర్వీస్ రివాల్వర్‌ను గురిపెట్టిన సంఘటన ఆదివారం ఎస్‌ఎంసి సర్కిల్‌లో చోటుచేసుకొంది. దీంతో ఆగ్రహించిన భక్తులు ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా మరికొంతమంది భక్తులు చేరి పోలీసులను నిలదీశారు.

12/21/2015 - 07:01

కందుకూరు, డిసెంబర్ 20: పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఓవైపు కాల్‌మనీ వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా కందుకూరు ప్రాంతంలో మాత్రం వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 3వ వార్డు ఉప్పుచెరువులో ఆదివారం ఫైనాన్స్ వ్యాపారి దాష్టీకానికి ఓ కుటుంబం రోడ్డున పడింది.

12/21/2015 - 07:01

రామచంద్రపురం, డిసెంబర్ 20: దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ ఉత్తర ద్వారం సమీపంలో శ్రీఅతిరుద్రం మహాయజ్ఞం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రం శ్రీమణిద్వీప మహాసంస్థానానికి చెందిన భగవతీ శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి కరుణామయి అమ్మ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది.

12/21/2015 - 07:00

విశాఖపట్నం, డిసెంబర్ 20: కాల్ మనీ కేసులో ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చీటీ మొత్తాన్ని చెల్లించాలంటూ తన తల్లిపై వత్తిడి తెచ్చినందుకు అవమానాన్ని భరించలేక ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం విశాఖలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కంచరపాలెం సమీపంలోని పెదకొత్తూరులో మైలపల్లి గరగయ్య నివసిస్తున్నాడు. ఇతడు రాడ్ బెండర్‌గా పనిచేస్తున్నాడు.

12/21/2015 - 06:59

రామచంద్రపురం, డిసెంబర్ 20: పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు... నిజంగా నరకం ఉందో లేదో కానీ, ఓ పుత్రుడు మాత్రం కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి చేతికి వైర్లు చుట్టి, విద్యుదాఘాతానికి గురిచేయడం ద్వారా హత్యచేశాడు. వళ్లు జలదరించే ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదూరు గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకుంది.

12/21/2015 - 06:33

హైదరాబాద్, డిసెంబర్ 20: పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడంతోపాటు ప్రచురణకర్తలకు ఊపిరిపోస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ కృషి శ్లాఘనీయమైనదని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఆదివారం హెదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలోని రచయిత సుద్దాల హన్మంతు వేదికపై ‘ఎడిటర్స్ మీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దినపత్రికలకు చెందిన సంపాదకులు హాజరయ్యారు.

12/21/2015 - 06:30

తిరుమల, డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించి, వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. వీరికి సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుండి ఆలయం లోపలకు అనుమతించడానికి టిటిడి చర్యలు చేపట్టింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.

12/21/2015 - 06:26

హైదరాబాద్, డిసెంబర్ 20: విజయవాడ కాల్‌మనీ- సెక్స్ రాకెట్ కేసు ప్రకంపనల నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల నియంత్రణ బిల్లు రూపొందించేందుకు కసరత్తును ప్రారంభించింది. ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడం అనుమానమే.

12/21/2015 - 06:25

హైదరాబాద్, డిసెంబర్ 20: కాల్ మనీపై రాజకీయాలు వద్దని బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. కాల్ మనీపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మాని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పాలక, ప్రతిపక్షాలకు సూచించారు.

Pages