S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/14/2015 - 16:24

హైద‌రాబాద్‌: ఇటుక బట్టీల్లో వలస కార్మికుల దుస్థితిపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కార్మికుల ప్రయోజనాల కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించారు. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.

12/14/2015 - 16:04

హైద‌రాబాద్‌: స‌వ‌తి త‌ల్లి చేతిలో చిత్రహింస‌ల‌కు గురైన ప్రత్యూష కేసు హైకోర్టులో విచార‌ణ జ‌రిపారు. ప్రత్యూష స‌వ‌తి త‌ల్లి ఉంటోన్న ఇల్లు కిరాయి డ‌బ్బులు ఎంత వ‌స్తున్నాయో తెలుసుకుని కోర్టుకు చెప్పాల‌ని ఆదేశించారు. ఆ డ‌బ్బును ప్రత్యూష ఖాతాలో జ‌మ‌చేయాల‌ని పేర్కొన్నారు. త‌దుప‌రి కేసు విచార‌ణ‌ను రెండు వారాలకు వాయిదా వేశారు.

12/14/2015 - 15:39

హైదరాబాద్ :కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించాలని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైఎస్సార్ సీపీ నేతలు కె.

12/14/2015 - 13:33

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 59 గంటల ప్రక్రియలో బుధవారం సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి ప్రవేశించనుంది.

12/14/2015 - 13:27

హైదారబాద్ : అంబర్‌పేట తహశీల్దార్ సంధ్యారాణి సోమవారంనాడు కోర్టులో లొంగిపోయారు. ఆమె సోదరుడు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో తనను కూడా అరెస్టు చేస్తారని సంధ్యారాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె సోమవారంనాడు కోర్టులో లొంగిపోయారు.

12/14/2015 - 13:24

హైదరాబాద్ : సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి సోమవారంనాడు అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పలు తెలుగు, కన్నడ, తమిళ సినిమాలకు పనిచేశారు. జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమాకు మూలకథను అందించారు.

12/14/2015 - 08:47

విజయవాడ, డిసెంబర్ 13: విజయవాడ నగరం ఇప్పటివరకు అనేకానేక విధాలైన నేరాలను చవిచూసింది. అయితే తాజాగా కాల్‌మనీ పేరిట మహిళల మాన, ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ వెలుగులోకి వచ్చిన దందాను అంత తేలిగ్గా వదలరాదు.. ఎవరైనా, ఎంతటివారైనా, ఏ పార్టీవారైనా తన, మన చూడకుండా ఎన్‌కౌంటర్ చేయాలి.. లేదా అడ్డంగా నరికివేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) నిప్పులు చెరిగారు.

12/14/2015 - 08:46

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రాన్ని అత్యధిక ఆర్థిక ఆదాయం అర్జించే శక్తిగా తీర్చిదిద్దటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. ప్రైవేటు రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ విద్యారంగంలో గుణాత్మక సంస్కరణలు చేపట్టడానికి ఈ నెల 15న మలేసియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ను సమ్మిళిత, స్థిరమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం నిశ్చయించింది.

12/14/2015 - 08:45

సింహాచలం, డిసెంబర్ 13: బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ సిఎండి చెంగవల్లి వెంకట్ పిలుపునిచ్చారు. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో సింహాచలం స్వామి కల్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం బ్రాహ్మణ సదస్సు జరిగింది.

12/14/2015 - 08:42

విశాఖపట్నం, డిసెంబర్ 13: సుమారు పదేళ్ల కిందట ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించలేక డాక్టర్లు చేతులెత్తేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చింది. ఈ పథకం కింద వివిధ ఆపరేషన్లకు సంబంధించి ప్యాకేజీలు పెంచకపోతే, ఆ పథకాన్ని తమతమ ఆసుపత్రుల్లో కొనసాగించలేమని తేల్చి చెప్పారు.

Pages