S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/04/2015 - 04:49

చెన్నైనుంచి విమానంలో 106మంది ప్రయాణికుల తరలింపు
సురక్షితంగా తీసుకువచ్చిన హైదరాబాద్ రెస్క్యూ టీమ్
చెన్నై నుంచి ఆంధ్ర, తెలంగాణకు వచ్చే 19 రైళ్ల రద్దు
బాధితులకు 24 గంటలు వైద్య సేవలు: అపోలో ప్రకటన

12/03/2015 - 18:38

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల వర్షం కురిపించారు. విద్యుత్ బకాయిలు, నల్లనీటి బిల్లుల బకాయిలపై మంత్రులు తలసాని, పద్మారావు, జల మండలి అధికారులతో ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్, నీటి బకాయిలు రద్దు చేయాలని నిర్ణయించారు.

12/03/2015 - 17:48

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ సమావేశాలలోనే ప్రైవేటు వర్శిటీ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గురువారం నాడు ఆయన విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.

12/03/2015 - 15:45

హైదరాబాద్ : ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ వేడుకలు వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నై నగరంతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వందలాది మంది మృతి చెందారు. ఇటువంటి సమయంలో వేడుకలు నిర్వహించడం భావ్యం కాదని సీఎం పేర్కొన్నారు.

12/03/2015 - 06:30

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, గ్రామీణ రంగంలో ఆదాయ మార్గాలు పెంచడంతో పాటు ఇంధన సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్రా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఎఎస్ అధికారి దినేష్‌కుమార్ చెప్పారు.

12/03/2015 - 06:29

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్ర రాష్ట్రంలో సైబర్, ఆర్ధిక నేరాలపై ఉక్కుపాదం మోపుతామని, టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ఘరానా మోసాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాష్ట్ర డిజిపి జెవి రాముడు హెచ్చరించారు.

12/03/2015 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ‘స్లెట్’(స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్టు) ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘స్లెట్’ నిర్వహణ బాధ్యతలు ఆంధ్రాయూనివర్శిటీకి అప్పగించారు. యూనివర్శిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకానికి ప్రాధమిక అర్హతగా స్లెట్‌ను పరిగణిస్తారు.

12/03/2015 - 06:18

మెదక్/మహబూబ్‌నగర్/నల్లగొండ, డిసెంబర్ 2: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయ. వ్యవ సాయం కోసం చేసిన చేసిన అప్పు లు పెను భారంగా పరిణమించడం, రుణాలు మాఫీ చేస్తామన్న పాలకుల హామీలు ‘నీటిపై రాతలు’గా మిగిలిపోవడం వారి పాలిట యమ పాశాలు అవుతున్నాయ. తాజాగా అప్పుల బాధలు భరించలేక వివిధ జిల్లాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ఒక రైతు గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే..

12/03/2015 - 06:12

రాజమండ్రి, డిసెంబర్ 2: భూములు, ఇతర వ్యవహారాల రిజిస్ట్రేషన్లకు ఆధార్ కార్డును విధిగా జత చేయాలన్న నిబంధన కచ్చితంగా అమలవుతోంది. ఈ నిబంధన చాలా కాలం నుండే అమలులో ఉన్నప్పటికీ, అంతగా పట్టించుకోని రిజిస్ట్రేషన్ అధికారులు గత 15రోజులుగా ఆధార్ కార్డును తప్పనిసరిచేశారు.

12/03/2015 - 06:11

కడప, డిసెంబర్ 2: కడప జిల్లా హౌసింగ్ ఫెడరేషన్ (హౌస్‌ఫెడ్)లో సుమారు పాతికకోట్ల రూపాయలకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. ఇళ్లను నిర్మించకుండానే సొసైటీలకు యథేచ్చగా రుణాలు ఇవ్వడం ద్వారా పలువురు అధికారులు కోట్లాదిరూపాయలు స్వాహాచేసినట్లు తెలుస్తోంది. హౌస్‌ఫెడ్‌లో సభ్యులైన వారికి రూ.3లక్షలు నుంచి రూ.5లక్షల వరకు ఏపి హౌసింగ్ ఫెడరేషన్ రుణాలను మంజూరు చేసింది.

Pages