S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/02/2015 - 18:22

హైదరాబాద్: తమిళనాడు వరద బాధితులకు సహాయం చేసేందుకు టాలీవుడ్ సినీ తారలు ముందుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రూ.10లక్షలు, కళ్యాణ్‌రామ్ రూ.5లక్షలు, వరుణ్‌తేజ్ రూ. 3లక్షలు, సంపూర్ణేశ్‌బాబు రూ.50చొప్పున తమిళనాడు సీఎం సహాయనిధికి విరాళాలను అందించారు.

12/02/2015 - 15:58

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన బోయింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సంస్థల భాగస్వామ్యంతో పరిశ్రమ ఏర్పాటుకానుందని వివరించారు.

12/02/2015 - 14:17

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

12/02/2015 - 14:05

హైదరాబాద్: తెలంగాణలో శాసనమండలి ఎన్నిక నోటిఫికేషన్‌ బుధవారం వెలువడింది. స్థానిక సంస్థల కోటా కింద 12 మంది ఎన్నికకు ఈనెల 27న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 9వరకు నామినేషన్ల స్వీకరణ, 10న పరిశీలన ఉటుంది. ఉప సంహరణకు ఈనెల 12 వరకు గడువు, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.

12/02/2015 - 07:48

రావులపాలెం, డిసెంబర్ 1: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అంతా అవగాహన పెంచుకోవాలని సందేశమిస్తూ మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో 350 అడుగుల భారీ రెడ్ రిబ్బన్‌తో విద్యార్థులు ప్రదర్శన జరిపారు.

12/02/2015 - 07:47

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ ఎంపికకు ఈ నెల 6వ తేదీన ఆన్‌లైన్ సిబిఆర్‌టి పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. ఈ పరీక్షకు 19721 మంది దరఖాస్తు చేశారని అన్నారు. పరీక్ష పేపర్-1 ఆరో తేదీన ఉదయం 10 గంటల నుండి 12.30 వరకూ జరుగుతుందని, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు.

12/02/2015 - 07:47

తిరుపతి/నెల్లూరు, డిసెంబర్ 1: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపధ్యంలో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో మంగళవారం కూడా కుంభవృష్టిగా వర్షం కురిసింది. చిత్తూరు తూర్పు మండలాల్లో కురిసిన వర్షాలతో పలు గ్రామాలు జల దిగ్భంధనంలోచిక్కుకున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సరాసరిన 10 సెం.మీ.వర్షపాతం నమోదవగా, కె వి బి పురంలో అత్యధికంగా 14 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

12/02/2015 - 07:45

కడప, డిసెంబర్ 1: గత రెండురోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు పెద్దఎత్తున నీరు చేరి 68 టిఎంసిల నీరు నిల్వఉంచడంతో బ్యాక్‌వాటర్‌లో వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అంతకుముందు వారంరోజులు కురిసిన వర్షాలకు 64టిఎంసిల నీరును నిల్వచేయగా, ప్రస్తుతం 68 టిఎంసిలకు చేరింది.

12/02/2015 - 07:44

ప్రత్తిపాడు, డిసెంబర్ 1: కాపులను బీసీల్లో చేరుస్తూ 2016 బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయాలని మాజీ మంత్రి, కాపురిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండు చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో లేఖను పత్రికలకు విడుదలచేశారు.

12/02/2015 - 07:36

హైదరాబాద్/ నల్లగొండ, డిసెంబర్ 1: ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన సమయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం’ (20 పాయింట్ ప్రోగ్రాం) ఉం టుందా? ఊడుతుందా? అన్నది చర్చనీయాంశం అయింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి కేంద్రీకరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Pages