S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/30/2020 - 23:54

ఇంద్రకీలాద్రి, జూన్ 30: వసంత పంచమి సందర్భంగా గురువారం ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత శ్రీ కనకకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవి అలంకారంతో దర్శనం ఇచ్చింది. ఈ సందర్భంగా దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు తదితరులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజా ద్రవ్యాలను సమర్పించారు. అర్చకులు తొలుత గణపతి పూజ నిర్వహించారు.

01/30/2020 - 23:46

గుంటూరు, జనవరి 30: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు గురువారం పంపారు.

01/30/2020 - 23:44

కరీంనగర్, జనవరి 30: తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలనే ఆకాంక్షతో ప్రజాయుద్ధానికి తెరలేపి అలుపెరుగని పోరు సాగిస్తున్న మావోయిస్టు పార్టీలో మరోసారి పెద్దన్నలుగా మళ్ళీ మన తెలుగోళ్ళకే అవకాశం దక్కింది.

01/30/2020 - 05:02

భద్రాచలం టౌన్: భద్రాద్రిలో భక్త రామదాసు జయంత్యుత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తరామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న 387వ జయంతిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన నవరత్న కీర్తనలతో భద్రాచలం పుణ్యక్షేత్రం పులకరించింది. రామదాసు జయంత్యుత్సవాల సందర్భంగా ముందుగా గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో రామదాసు విగ్రహానికి పంచామృతాభిషేకం గావించారు.

,
01/30/2020 - 04:37

తాడ్వాయి, జనవరి 29: మేడారంలో మండమెలిగే పండుగతో జాతర ఘట్టం ఆరంభమైంది.

01/30/2020 - 01:15

సికిందరాబాద్, జనవనరి 29: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది. ఎపిడామాలజిస్టు డా.అనిత వర్మ, రెస్పీరేటర్లు డా.అజయ్ చౌహాన్, బయాలజిస్టు డా.శుభ బృందానికి ఆసుపత్రి సుపరింటెండెంట్ డా.శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆహ్వానం పలికారు.

01/30/2020 - 00:46

తిరుపతి, జనవరి 29: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న హథీరాంజీ మఠం మహంత్ అర్జున్‌దాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ధార్మిక పరిషత్ నుంచి ఎండోమెంట్ అధికారిణి పద్మ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక మఠం ఆలనాపాలనా చూసేందుకు వీలుగా శ్రీకాళహస్తి ఈవోను ఫిట్‌మెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

01/29/2020 - 06:28

హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో హింసకు తావు లేదని, హింసను ప్రేరేపించే ఏ విషయానికీ యువత మద్దతు ఇవ్వరాదని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మతోన్మాదాన్ని ప్రోత్సహించే వారు సెక్యులరిజం అనే పదాన్ని అడ్డుపెట్టుకుని ఇతరులపై దాడి చేస్తుంటారని, అలాంటి ప్రయత్నాలను ఖండించాలని అన్నారు. తప్పుడు పనులు చేస్తున్న వారిని సమర్ధించడం జాతి వ్యతిరేక చర్య అవుతుందని అన్నారు.

01/29/2020 - 06:23

హైదరాబాద్, జనవరి 28: జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ - టైపిస్టు గ్రూప్ -4 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ 2018 అక్టోబర్ 7వ తేదీన లిఖిత పరీక్ష నిర్వహించింది. అందులో అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగింది, అయితే మిగిలి పోయిన పోస్టులకు రెండో దశలో మరికొంత మందికి పబ్లిక్ సర్వీసు కమిషన్ అవకాశం కల్పించింది.

01/29/2020 - 06:23

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణలోని ప్రధాన దేవాలయాల ప్రసాదాన్ని భక్తులకు వారి ఇంటి వద్దకే అందించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వినూత్న పథకానికి శ్రీకారం చుడుతోంది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమినర్ వి. అనిల్‌కుమార్ నేతృత్వంలో బుధవారం జరిగే సమావేశంలో ‘ఇండియన్ పోస్ట్’ అధికారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకునే అవకాశం ఉంది.

Pages