S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/22/2015 - 22:46

విజయవాడ: తుపాను వర్షాల వల్ల నెల్లూరు నగరమంతా మునిగిపోతే బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులేమీ విడుదల చేయలేదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పబ్బరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగులపై మాత్రం వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ విమర్శించారు.

11/22/2015 - 22:46

*నలుగురు మహిళలతో సహా ఆరుగురు మావోయిస్టులు హతం

11/22/2015 - 22:43

తిరుమల: తిరుమలలో శనివారం రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్‌రోడ్డులో మూడుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

11/22/2015 - 22:43

చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 28 మంది రౌడీషీటర్లను విచారించే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం చింటూ ముఖ్యఅనుచరుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేశారు.

11/22/2015 - 22:43

నెల్లూరు: కాంగ్రెస్ పాలనతో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని, ఇప్పుడు కూడా అదే మాదిరి నిర్లక్ష్య ధోరణి ఇంకా వివిధ శాఖల అధికార యంత్రాంగంలో చోటుచేసుకోవడం తగదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆదివారం సోమశిలలో ఆయన మాట్లాడుతూ తాను వస్తే తప్ప జిల్లాలో వరద సహాయక చర్యలు ప్రారంభానికి నోచుకోలేదంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ పైమేర స్పందించారు.

11/22/2015 - 22:42

నెల్లూరు: సమస్త మానవాళికి నిత్యం ఉపయోగపడే నీటిని పొదుపుగా వినియోగించుకునే విధానాలపై ప్రజాభిప్రాయసేకరణ నిమిత్తం శే్వతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆదివారం ఆయన నెల్లూరుజిల్లా సోమశిల జలాశయం వద్ద పూజలు నిర్వహించి తెలుగుగంగ (కండలేరు) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు.

11/22/2015 - 22:42

పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన పెన్సిల్ వేనియా యూనివర్శిటీ సీనియర్ ప్రొఫెసర్ కెంగీ ఉచినో సత్యసాయి విద్యావిధానం ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో భాగంగా 24 మందికి బంగారు పతకాలు, ఐదుగురికి ఎంఫిల్ పట్టాలు, ఆరుగురికి పిహెచ్‌డిలు ప్రదానం చేశారు.

11/22/2015 - 22:42

* వరద బాధితుల సాయంలో నిర్లక్ష్యం వహించిన డీలర్లపై వేటు..
* రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత

11/22/2015 - 22:41

* బుగ్గమల్లేశ్వరస్వామి ఆగ్రహించాడని జనం బెంబేలు..
* సున్నపురాయి వల్లేనని భూగర్భశాఖ అధికారుల నిర్ధారణ

11/22/2015 - 08:13

చిన్నచింతకుంట, నవంబర్ 21: మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలంలో శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక శనివారం సందర్భంగా పల్లె ప్రాంతాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి కొండ దిగువ ప్రాంతం నుండి స్వామి వారి ప్రధాన ఆలయం వరకు భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు.

Pages