S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/28/2020 - 23:35

మక్కువ, జనవరి 28: విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబరలోని గిరిజనుల ఆరాధ్య దైవం శంబర శ్రీపోలమాంబ అమ్మవారి జాతరకు మంగళవారం భక్తజనం పోటెత్తింది. సోమవారం తొలేళ్ల ఉత్సవం అనంతరం మంగళవారం నిర్వహించిన సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకుని ఉత్తరాంధ్ర, తెలంగాణా, ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఆశీస్సులు తీసుకున్నారు.

01/28/2020 - 23:33

కొత్తూరు, జనవరి 28: ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా పంచాయతీలో కన్హా ఆశ్రమాన్ని హార్ట్ఫుల్‌నెస్ సంస్థ గ్లోబల్ హెచ్ క్వార్టర్‌గా ప్రకటించడమే కాకుండా ధ్యాన మందిరాన్ని యోగా గురూజీ బాబా రాందేవ్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమలేష్ డీ పటేల్ ప్రారంభించి ప్రప్రథమ మార్గదర్శి లాలాజీకి అంకితం చేశారు.

01/28/2020 - 06:36

గుంటూరు: ఎన్నార్సీ భారతదేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందని, కేవలం ముస్లింల కోసమే మాత్రమే పెట్టింది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశం జరిగింది.

01/28/2020 - 06:14

ఖమ్మం, జనవరి 27: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఐదు మున్సిపాల్టీల చైర్మన్ పదవులు తెలంగాణ రాష్ట్ర సమితి ఖాతాలోకే చేరాయి. సోమవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో మధిరలో మాత్రమే ప్రతిపక్ష పార్టీల కూటమి అభ్యర్థి పోటీలో నిలబడగా మిగిలినవన్నీ ఏకగ్రీవంగానే సాగాయి.

01/28/2020 - 02:15

విజయవాడ (సిటీ), జనవరి 27: ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశతో ప్రభుత్వంలో సంస్థ విలీనాన్ని కోరుకోగా, నేడు కార్మికులు, ఉద్యోగులకు ఎన్నో సమస్యలు ఎదురౌతున్నాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు వాపోయారు.

01/27/2020 - 23:44

హైదరాబాద్, జనవరి 27: కొత్తగా వస్తున్న అంటువ్యాధులను త్వరగా గుర్తించడానికి, నివారించడానికి అంతర్జాతీయ సహకారాన్ని పొందాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన సీసీఎంబీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని విభాగాలనూ సందర్శించి అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు.

01/27/2020 - 07:04

హైదరాబాద్: తెలుగులో సాహిత్య కృషికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్‌కు చెందిన విజయసారథికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించిందని ప్రణాళికా సంఘం రాష్ట వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.

01/27/2020 - 07:03

హైదరాబాద్, జనవరి 26: రాష్ట్రంలో ప్రయాణికుల ఆదరణను ఆర్టీసీ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవాలు బస్సు భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులు బాగా పని చేయడంతో సంస్థ జాతీయస్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్నదని ఆయన గుర్తు చేశారు.

01/27/2020 - 01:27

సికిందరాబాద్, జనవరి 26: దేశాన్ని ప్రపంచంలో శక్తిశాలి దేశంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆ ప్రయత్నం జరుగుతుందని, దానికి దేశ ప్రజలంతా మద్దతు, ఆశీస్సులు కావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహా హారతి కార్యక్రమంలో 3వేల మంది బాలికలు భారతమాత వేషధారణలో వచ్చినట్లు తెలిపారు.

01/26/2020 - 06:34

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కాకినాడ, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు 30న ఆయా మార్గాల్లో నడుస్తాయి. సికింద్రాబాద్- కాకినాడ (07053) రైలు సికింద్రాబాద్‌లో 30వ తేదీన సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

Pages