S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/17/2019 - 01:22

హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ అధికారుల తీరే వేరు. దేశం మొత్తం ఒక విధంగా స్పందిస్తే, వీరు మాత్రం మరోలా వ్యవహరిస్తారు. కేంద్ర బడ్జెట్‌పై కనీస అవగాహన కూడా లేని కారణంగా, విద్యా శాఖకు నిధులు తగ్గిపోయాయి. కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు జారీ చేసే ముందు రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపించమని కోరుతుంది.

07/17/2019 - 01:20

హైదరాబాద్, జూలై 16: ఇళ్లు లేని నిరుపేదలపై నయాపైసా భారం మోపకుండా ఉచితంగా ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద నిర్మించిన లక్షా 23 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నా, మున్సిపల్ ఎన్నికలు అడ్డంకిగా మారింది.

07/17/2019 - 05:21

విజయవాడ(సిటీ) : రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయని దీనిపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి అనుమతించాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబట్టారు.

07/17/2019 - 01:12

అమరావతి, జూలై 16: రాష్ట్ర విభజన నాటి నుంచి కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రతరమైందని, అయితే నాడు 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిపై ఆధ్యయనానికి రూ.40 లక్షలు కూడా కేటాయించకుండా వంచించారని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆరోపించారు.

07/17/2019 - 05:22

అమరావతి : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెంపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతివారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై మంగళవారం సచివాలయం నుంచి సమీక్షించారు. ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/17/2019 - 00:48

రాయచోటి, జూలై 16: కడప జిల్లా రాయచోటిలో మంగళవారం జరిగిన ఓపెన్ డిగ్రీ పరీక్షలు పరీక్షల విధానానికే మచ్చతెచ్చేలా సాగాయి. కొంతమంది అభ్యర్థులు సెల్‌ఫోన్లు, పుస్తకాల్లో చూసి సమాధానాలు రాయగా, మరికొంత మంది ఏకంగా ప్రశ్నపత్రాలను ఇళ్లకు తీసుకువెళ్లి తాపీగా సమాధానాలు రాసి తెచ్చిఇవ్వడం గమనార్హం. ఇదేమీ పట్టని ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ పాటలతో కాలక్షేపం చేయడం మిరంత విడ్డూరం.

07/17/2019 - 00:45

అమరావతి : కాపు వర్గీయులకు రిజర్వేషన్ అమలుపై శాసనసభ దద్దరిల్లింది. మంగళవారం ప్రశ్నోత్తరాల అనంతరం కాపులకు బీసీ రిజర్వేషన్ అంశంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య సంవాదం చోటుచేసుకోగా, వైసీపీ.. టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.

07/17/2019 - 00:44

విజయవాడ : ఆటో కార్మికుల విషయమై మంగళవారం శాసనసభలో తీవ్రస్థాయిలో గందరగోళం చెలరేగింది. గత ఏడాది మే ఒకటో తేదీన మచిలీపట్నంలో పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ తనను కల్సిన ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు నేడు సొంత ఆటో కలిగిన కార్మికులందరికీ రూ.10వేలు చొప్పున నగదు అందించేందుకు బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు.

07/17/2019 - 00:42

అమరావతి, జూలై 16: రిజర్వేషన్ పేరుతో కాపులకు చంద్రబాబు తీరని దగా చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాపులు బీసీ రిజర్వేషన్ అడుగుతుంటే కేంద్రం అగ్రకులాల్లో పేదలకు చట్టపరంగా అమలు చేస్తామని ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌లో 5 శాతం కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి మరోసారి వంచనకు గురిచేశారని ఆరోపించారు.

07/16/2019 - 05:52

వరంగల్ : వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు సోమవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గం టలకు నిత్యహ్నికం పూర్తిచేసిన అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులలో ఇచ్ఛాశక్తిని ముద్రక్రమంలోనూ జ్ఞానశక్తిని జ్వాలామాలినిగా అలంకరించి పూజారాధనలు చేశారు. దశమహా విద్యలలో ఆద్య విద్య అయిన కాళీ నవర్య క్రమంలో చతుర్దశి ఆదిదేవత శంకరుడు.

Pages