S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/17/2019 - 05:52

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రాష్టశ్రాఖ సిద్ధంగా ఉందని, పార్టీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లు, ప్రచారం , ఇతర సన్నాహాలు ప్రారంభించామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు.

02/17/2019 - 03:20

విజయవాడ, ఫిబ్రవరి 16: ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైకాపా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌కు రాజకీయాలంటే వ్యాపారమని ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని నివాసం నుంచి శనివారం టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, బాధ్యులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.

02/17/2019 - 03:19

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: నా జోలికి రాకండి... మీ పరిధిలో మీరుండండి అంటూ మంత్రి గంటాకు ఇటీవలే వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ సూచించారు. రాజకీయాల్లో విలువలపై మంత్రిగా ఉన్న మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన అవంతి శుక్రవారం విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు.

02/17/2019 - 03:15

విజయవాడ, ఫిబ్రవరి 16: లోక్‌సభ, శాసనసభతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల లిస్టు రూపకల్పనలో ఎటువంటి తప్పులు చోటుచేసుకున్నా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టులను ఈ నెల 20వ తేదీ ప్రచురించనున్న నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

02/17/2019 - 03:14

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 16: శ్రీరామనవమి ముహూర్తం ఖరారైంది. వైదిక పెద్దలు సీతారాముల కల్యాణ వేడుక తేదీని ఏప్రిల్ 14గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ పుణ్య ఘడియలకు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉత్సవాల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కాగా ఏప్రిల్ 6వ తేదీన ఉగాది రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

02/17/2019 - 02:23

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: ఉత్తరాంధ్ర జిల్లాలకు వేసవిలో బోల్డంత విద్యుత్ అందుబాటులోకి రానుంది. భవిష్యత్, గృహావసరాలను తీర్చడం, కొత్త పరిశ్రమలు వచ్చినా సరిపడే విద్యుత్‌ను ముందుగానే సమకూర్చుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది.

02/17/2019 - 02:31

యాదగిరిగుట్ట: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల రెండోరోజు శనివారం స్వామివారి కల్యాణమహోత్సవానికి ముక్కోటి దేవతలను గరుత్మతుండు ఆహ్వానించే ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వాన ఘట్టలను యాజ్ఞీక, అర్చక బృందం పాంఛరాత్రగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు.

02/17/2019 - 02:17

నిజామాబాద్, ఫిబ్రవరి 16: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును అందుకున్న ఆమెకు, ఐక్యరాజ్య సమితి సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది.

02/17/2019 - 02:15

తిరుపతి, ఫిబ్రవరి 16: తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాకుంభాభిషేకాన్ని ఏప్రిల్ 22 నుంచి 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహామండలి నిర్ణయించింది. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధ్యక్షతన ఆగమ సలహామండలి సమావేశం జరిగింది.

02/17/2019 - 01:56

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రాబోయే లోక్‌సభ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొద్దిగా కష్టపడితే పార్టీ పునర్ వైభవాన్ని సాధించుకోవచ్చన్నారు.

Pages