S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/18/2019 - 01:46

సంగారెడ్డి, మార్చి 17: ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించినా గడచిన రెండు దశాబ్దాల్లో ప్రాభవాన్ని కోల్పోతోంది. మెదక్ పార్లమెంటు స్థానం నుండి ప్రాతినిథ్యం వహించి దేశానికే ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఇందిరాగాంధీకి సైతం ఈ నియోజకవర్గం అండగా నిలిచింది.

03/18/2019 - 04:32

బోధన్: పార్టీ కోసం కష్టపడే వారికి అందాల్సిన ఫలాలు ప్రతిపక్షాల వారికి అందుతున్నాయి.. నాయకులు వారి స్వార్థం కోసం కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు.. అందువల్లనే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తెరాసకు ఓట్లు తక్కువగా వచ్చాయా? అంటే.. ఇది అక్షర సత్యమని బూత్ కమిటీ నాయకుల సమావేశంలో వెల్లడైంది.

03/18/2019 - 04:33

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పదవ రోజు ఆదివారం మహాపూర్ణాహుతి, సుదర్శన చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు అర్చక, యాజ్ఞిక బృందం శాస్తయ్రుక్తంగా ఘనంగా నిర్వహించింది.

03/18/2019 - 00:48

హైదరాబాద్, మార్చి 17: కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే కాకుండా ఆ పార్టీ ముఖ్యనేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడానికి క్యూ కటుడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఆదివారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

03/18/2019 - 00:45

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఆదివారం గజ్వేల్ సమీపంలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి వనమా సంసిద్ధతను వ్యక్తం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు.

03/18/2019 - 00:44

హైదరాబాద్: తెలంగాణ రైతులకు ‘డబల్ దమాఖా’ అమలవుతోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్’ పథకం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుండి అమల్లోకి తీసుకువచ్చిన ‘రైతుబంధు’ పథకం వల్ల రైతులకు లబ్ధి జరుగుతోంది. అయితే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం-కిసాన్ పథకానికి పెద్దగా ప్రచారం జరగలేదు.

03/18/2019 - 00:43

కరీంనగర్, మార్చి 17: నిరాశవాద రాజకీయాల నుంచి ఉద్యమం వైపు మళ్ళించి, ప్రత్యేక పోరాటానికి దశ,దిశ చూపి, రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపటంలోక్రియాశీలక భూమిక పోషించిన పోరుగడ్డ కరీంనగర్ ప్రజలు దీవిస్తే దేశం తలరాత కూడా మారుస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. 17వ లోక్‌సభ సమరభేరికి అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆదివారం నగర శివారులో శంఖారావం మోగించింది.

03/18/2019 - 00:26

కడప, మార్చి 17: ‘‘అధికార రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. ఇక ఏ రాజకీయమైనా కేవలం గ్రేటర్ రాయలసీమ కోసమే’’ అని మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన 6 జిల్లాల నేతలు, ప్రజలతో త్వరలో ఒక మహాసభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

03/18/2019 - 00:23

నర్సీపట్నం, మార్చి 17: పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను. .వారి బాధలు విన్నాను...సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతీ కుటుంబానికి ‘నేనున్నాను’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జగన్ ఆదివారం ప్రారంభించారు.

03/18/2019 - 02:52

మొత్తం జాబితా విడుదల* వైకాపా లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితా

Pages