S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/07/2018 - 02:18

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: పర్యాటక రంగంలో గడచిన నాలుగు సంవత్సరాల్లో 14.62 మిలియన్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్‌ఫోన్స్ తెలియచేశారు. 34వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేట్స్ (అయాటో) నాలుగు రోజుల సదస్సు గురువారం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్‌ఫోన్స్ మాట్లాడుతూ టూర్ ఆపరేటర్లే ఇండియాకు నిజమైన అంబాసిడర్స్ అని అన్నారు.

09/07/2018 - 02:16

హైదరాబాద్, సెప్టెంబర్ 6: టీఆర్‌ఎస్ గురువారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో 14 స్థానాలను పెండింగ్‌లో పెట్టడం వెనుకనున్న మతలబు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 105 స్థానాలకు పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.

09/07/2018 - 02:13

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాహుల్ గాంధీ దేశంలోనే అతి పెద్ద బఫూన్ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పీడ విరగడకావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై కేసీఆర్ విరుచుకుపడ్డారు.

09/07/2018 - 02:12

విజయవాడ (ఇంద్రకీలాద్రి) సెప్టెంబర్ 6: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మకు ఇద్దరు భక్తులు వేరు వేరుగా రెండు పసిడి హారాలను బహూకరించారు. ఈ రెండు హారాల తూకం 1కిలో 291 గ్రాములు ఉండగా వీటి విలువ 40 లక్షల రూపాయలు. గురువారం ఉదయం చెన్నైకు చెందిన వేణుశ్రీనివాస్ కిలో122గ్రాముల తూకంతో ప్రత్యేకంగా తయారు చేయించిన కమల హారాన్ని ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మకు అందజేశారు. ఈ హారంలో 108 పసిడి కమలలు ఉన్నాయి.

09/07/2018 - 02:11

హైదరాబాద్, సెప్టెంబర్ 6: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా తమకు పొత్తులు ఉండదని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసారు. టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై స్పష్టత ఇచ్చారు. ఎంఐఎం తమకు మిత్రపక్షమన్నారు. వందకు వందశాతం టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ భవిష్యత్‌లో కూడా సెక్యులర్‌గానే ఉంటామన్నారు.

09/07/2018 - 02:03

గుంటూరు, సెప్టెంబర్ 6: రానున్న కాలంలో పరిపాలన కొనసాగించలేమన్న అభద్రతా భావంతోనే కేసీఆర్ తొమ్మిది నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ పెద్దిరెడ్డి విమర్శించారు.

09/07/2018 - 02:33

హైదరాబాద్, సెప్టెంబర్ 6:
1. భద్రాచలం డా. తెల్లం వెంకట్‌రావు
2. పినసాక పాయం వేంకటేశ్వర్లు
3. అశ్వరావుపేట తాటి వేంకటేశ్వర్లు
4. ఇల్లందు కోరం కనకయ్య
5. కొత్తగూడెం జలగం వేంకట్రావు
6. ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్
7. పాలేరు తుమ్మల నాగేశ్వరరావు

09/07/2018 - 01:01

హైదరాబాద్, సెప్టెంబర్ 6: శాసనసభకు నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. శాసనసభను రద్దు చేయడం వల్ల డిసెంబర్‌లో జరుగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే జరుగుతాయా లేదానన్న అనుమానాలకు తావే లేదన్నారు. శాసనసభ రద్దు తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌తో తానే స్వయంగా మాట్లాడినట్టు చెప్పారు.

09/07/2018 - 01:01

హైదరాబాద్, సెప్టెంబర్ 6: శాసనసభ రద్దు.. గవర్నర్ ఆమోదం.. ఆపద్ధర్మ ప్రభుత్వ గెజిట్ విడుదల అంతా కలయా.. వైష్ణవ మాయా? అన్న రీతిలో రెప్పపాటులో జరిగిపోయాయ. శాసనసభ రద్దు వ్యవహారమంతా క్షణాల్లో జరిగిపోవడం సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. శాసనసభ రద్దు ప్రతిని రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఒక చేతితో అందించగానే, దానిని ఆమోదిస్తూనే...

09/07/2018 - 00:59

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు కావడానికి కొద్ది సేపటి ముందు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇలాంటి పిచ్చోడు ప్రాతినిథ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండటం ఇష్టం లేకనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Pages