S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/24/2018 - 00:41

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 23: దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన రాఫెల్ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో గురువారం ఉదయం అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్తు ప్రణాళికలపై సమీక్షించారు.

08/24/2018 - 00:36

విశాఖపట్నం, ఆగస్టు 23: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సినవి అడిగితే, ఎదురుదాడి చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం ఇక్కడ జరిగిన జ్ఞానభేరి సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కోసం తాను ధర్మపోరాటం చేస్తున్నానని, అన్ని వర్గాల ప్రజలకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు.

08/24/2018 - 00:22

శ్రీశైలం ప్రాజెక్టు, ఆగస్టు 23: వరద పెరగడంతో గురువారం శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తివేసి సాగర్‌కు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. బుధవారం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు రాత్రి మరో గేటు, ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో గురువారం మరో మూడు గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 8 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువ సాగర్‌కు 3,20,063 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు.

08/23/2018 - 13:33

విజయవాడ: వరదల కారణంగా పొలాల్లోకి కొట్టుకు వచ్చిన విషసర్పాలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు పదులు సంఖ్యలో పాముకాటుకు గురవుతున్నారు. కృష్ణాజిల్లాలోని దివిసీమలో పాముల బెడద అధికంగా ఉంది. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే 17మంది చికిత్స పొందుతున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు పొలాల్లోనే పాముకాటుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను పెడుతున్నారు.

08/23/2018 - 13:29

విజయవాడ: స్వాతంత్య్ర సమరయోధుడు, అమరజీవి టంగుటూరు ప్రకాశం పంతులుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రజావేదికలో మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రకాశం పంతులు తన కష్టార్జితాన్ని త్యాగం చేశారని అన్నారు.

08/23/2018 - 13:26

అమలాపురం: ఎగువన వరద ఉధృతి తగ్గినప్పటికీ కోనసీమలో ఇంకా 41 గ్రామాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు నాటు పడవలను ఆశ్రయించి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద వరద నీరు 10 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటే తప్ప కాజ్‌వేలు వరద నీటి నుంచి బయటపడవు.

08/23/2018 - 20:55

విజయవాడ : రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను బిజెపి నేతలు గురువారం ఉదయం కలిసి వినతిపత్రం సమర్పించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు, పీడీ అకౌంట్స్‌లో అవినీతి, అమరావతి బాండ్ల జారీలో అవినీతిపై విచారణ జరపించాలని కోరుతూ.. గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జీవీఎల్‌ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణు కుమార్‌రాజు, విష్ణువర్థన్‌రెడ్డి పాల్గొన్నా‌రు.

08/23/2018 - 12:17

కర్నూలు : ఎగువ నుంచి భారీగా చేరుతున్న వరద నీటి కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 883.30 అడుగులుగా నమోదయ్యింది.

08/23/2018 - 12:15

విజయవాడ :: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం రైతులతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. ముందుగా.. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ నర్సింహపాలెంలో రైతులు నాడెప్‌ కంపోస్టు ద్వారా చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని వెంకయ్య పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా సమావేశమై ప్రకృతి వ్యవసాయం తీరు తెన్నులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

08/23/2018 - 05:55

తిరువనంతపురం, ఆగస్టు 22: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన కేరళలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. కాగా, రాష్ట్రంలో అన్ని లోన్లను రీషెడ్యూలింగ్ చేయడం ద్వారా ప్రజలకు ఊరట కల్పించాలని బ్యాంకులు నిర్ణయించాయ. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది. రుణాలపై వడ్డీని రద్దు చేయాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది.

Pages