S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/08/2018 - 02:00

విశాఖపట్నం: మోటార్ వాహనాల చట్టాన్ని సవరించాలని, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్లతో అఖిల భారత మోటారు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో మంగళవారం ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఆటోలు, లారీలు తిరగలేదు. విశాఖ నుంచి వివిధ ఆయిల్, గ్యాస్ కంపెనీల పెట్రోలియం ఉత్పత్తులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు.

08/08/2018 - 01:32

అనంతపురం, ఆగస్టు 7: అనంతపురం జిల్లా రైతులను కరవు ముందుగానే నిరాశపరిచింది. వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. వాతావరణంలో మార్పులతో ఆశించిన మేరకు నైరుతి రుతుపవనాలు జిల్లాపై ప్రభావం చూపలేదు. దీంతో ఆకాశం మేఘావృతం వడం చినుకు రాల్చకుండానే మేఘాలు కదిలిపోవడం రైతులను కలచివేస్తోంది. గాలి వేగం గంటకు 25 నుంచి 32 కిమీ ఉండడంతో మేఘాలు వర్షించకుండానే కదిలిపోతున్నాయి.

08/08/2018 - 01:29

ఒంగోలు, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.తాను అనునిత్యం విద్యార్థిగానే ఉంటానని, చదువు అనేది నిరంతరం నేర్చుకోవాలని, ఏదైనా ఉంటే దానిని రెండు నిమిషాల్లో నేర్చుకుంటానని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

08/07/2018 - 13:47

హైదరాబాద్: కేంద్రం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజారవాణా వ్యవస్థలు ప్రకటించిన బంద్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం నుంచే సిటీ బస్సులు మొదలు దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.

08/07/2018 - 13:43

పామూరు: ప్రకాశం జిల్లా పామూరులో ట్రిపుల్ ఐటీ భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్ నిర్వహించారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.

08/07/2018 - 12:48

పీలేరు:చిత్తూరు జిల్లా పీలేరులో శిల్ప(30) అనే వైద్యురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పీలేరు మండలం బాలంవారిపల్లెకు చెందిన రాజగోపాల్ కుమార్తె శిల్ప (30) తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో చిన్న పిల్లల వైద్య విభాగంలో ఇటీవల పీజీ చేశారు. కళాశాలలోని అధ్యాపకులు తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై ఇటీవల ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నివేదిక గవర్నర్ కార్యాలయానికి చేరింది.

08/07/2018 - 02:15

గణపతి నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణనాధుడు శరవేగంగా తన రూపును సంతరించుకుంటున్నాడు. ఆదిశేషుని పడగనీడలో గణపయ్యను తీర్చిదిద్దేందుకు కళాకారులు అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ గణనాధుని తిలకిస్తున్న సందర్శకులు.

08/07/2018 - 02:08

హైదరాబాద్, ఆగస్టు 6: భారతీయ సనాతన ధర్మమే విశ్వానికి మార్గం చూపుతోందని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. భగవత్ రామానుజుల జీవితంపై హైదరాబాద్ సమీపంలోని దివ్యసాకేత ధామం (శ్రీరామనగరం) జీవా ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన నాలుగురోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు.

08/07/2018 - 02:06

తిరుపతి, ఆగస్టు 6: భక్తుల సౌకర్యార్థం నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్, ఈదర్శన్, పోస్ట్ఫాసుల్లో ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. రూ. 300 దర్శన టికెట్లను నిర్దేశిత కోటాలో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు.

08/07/2018 - 02:05

తిరుపతి, ఆగస్టు 6: తిరుమల శ్రీవేంటేశ్వర స్వామివారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల శోభ తిరుపతిలో కనిపించేలా అలంకరణలు, కటౌట్‌లు, వివిధ దేవతామూర్తులతో కూడిన తోరణాలు, ఆకర్షణీయంగా విద్యుద్దీపాల వెలుగులు కనిపించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని ఈఓ అధికారులను ఆదేశించారు.

Pages