S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/20/2018 - 02:26

అనంతపురం, జూలై 19: ఎట్టకేలకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బెట్టువీడారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానని, పార్టీ విప్‌ను పట్టించుకోనని బుధవారం దివాకర్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది.

07/20/2018 - 02:25

మేదరమెట్ల, జూలై 19: ఏడున్నర కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్ పరికరాలతో ఉన్న లారీ మాయమైన సంఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చెన్నై రాష్ట్రం వెల్లూరు జిల్లాకు చెందిన కే.రంగనాథ్ తన సొంత లారీని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

07/20/2018 - 05:14

గుంటూరు, జూలై 19: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ప్రచార వాహనాల తయారీకి విజయలక్ష్మి డిజైనర్స్ శ్రీకారం చుట్టింది. నేతలు ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రత్యేకంగా ప్రచార వాహనాల తయారీని ప్రారంభించారు.

07/20/2018 - 01:55

విజయవాడ, జూలై 19: రవాణా రంగ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే లారీల నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్‌లో రంగం సిద్ధమైంది. అనాది నుంచి కూడా రవాణా రంగంలో ఆంధ్రప్రదేశ్, అందునా కృష్ణా జిల్లా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏపీలో భారీ ట్రక్కులు, లారీలు, ట్యాంకర్లు అన్నీ కలిపి దాదాపు 3లక్షల 20 వేలకు పైగా ఉంటే ఒక్క కృష్ణా జిల్లాలోనే 40వేల వరకు ఉన్నాయి.

07/20/2018 - 01:53

విజయవాడ, జూలై 19: పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న శుక్రవారం రోజు చాలా కీలకమైందని, అన్ని పార్టీల నేతలను కలవాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎంపీలతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇదొక చారిత్రక అవకాశమని, అందరి మద్దతు కూడగట్టాలని, ఏపీకి సంఘీభావం కోరాలని సూచించారు. ఇది స్ఫూర్తిదాయక సమయమని వ్యాఖ్యానించారు.

07/20/2018 - 05:10

విశాఖపట్నం, జూలై 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని సీడబ్ల్యుసీ సభ్యుడు, ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ అన్నారు. విశాఖ నగరంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చాందీ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు.

07/20/2018 - 05:11

న్యూఢిల్లీ, జూలై 19: లోక్‌సభలో శుక్రవారంనాటి అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అమీతుమీ తేల్చుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అవిశ్వాసాన్ని సులభంగా ఎదుర్కొంటామని, ఓటింగ్‌లో విజయం తమదేనని ఎన్డీఏ ధీమాతో ఉంది. వాస్తవానికి అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేటట్లు చేయడం బీజేపీకి నల్లేరు మీద నడకే. కాని మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో అవిశ్వాసతీర్మానం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

07/20/2018 - 05:16

భద్రాచలం టౌన్, జూలై 19: చత్తీస్‌గఢ్ రాష్ట్రం తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో గురువారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇటీవల మావోయిస్టులు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అదను చూసి భద్రతాబలగాలు వారిని దెబ్బతీశాయి. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

07/20/2018 - 01:40

హైదరాబాద్, జూలై 19: కేంద్రంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై ముందుగా ప్రకటన చేయడం అనవసరమని టీఆర్‌ఎస్ భావిస్తోన్నట్టు తెలిసింది. అవిశ్వాస అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ వరకు వెళ్లే పరిస్థితి ఉండదనే టీఆర్‌ఎస్ అంచనా.

07/20/2018 - 05:19

హైదరాబాద్, జూలై 19: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తరుణం త్వరలోనే రానుంది. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌సీఎల్‌టీ నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ పునరుద్ధరణకు తాము చేసిన ప్రయత్నాలను కేటీఆర్ వివరించారు.

Pages