S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/20/2018 - 01:10

విశాఖపట్నం: అధికార టీడీపీ సహా కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి చేరుతున్న నాయకులతో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర విశాఖలో ఉల్లాసంగా కొనసాగుతోంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో బుధవారం ఉదయం ముచ్చెర్ల నుంచి మొదలైన పాదయాత్ర గిడిజాల, వేమగొట్టిపాలెం, సెంచూరియన్ యూనివర్శిటీ, పాలవానిపాలెం మీదుగా 6.6 కిమీ మేర పాదయాత్ర చేశారు. ముచ్చర్ల వద్ద శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగానే

09/20/2018 - 00:33

అమరావతి, సెప్టెంబర్ 19: ‘అసమగ్రమైన ప్రణాళిక.. డిజైన్లను ఖరారు చేయటం.. భూ సేకరణ.. పునరావాసం.. పునర్నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం వల్ల 2004లో మొదలైన పోలవరం ప్రాజెక్టు అమలు మందగతిలో ఉంది. ఒప్పందపు నిబంధనలు పాటించటంలో నీటిపారుదలశాఖ వైఫల్యమూ ఇందుకు కారణం.

09/20/2018 - 00:31

విజయవాడ, సెప్టెంబర్ 19: పుష్కరాల్లో ముహూర్త సమయానికే గోదావరిలో మునకేయాలన్న మూఢ నమ్మకంతో భక్తులు దూసుకురావడం వల్లే తొక్కిసలాట తలెత్తిందని జస్టిస్ సీవై సోమయాజులు కమిటీ తేల్చింది. ముహూర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్‌లో 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటలో 27మంది ప్రాణాలో కోల్పోగా, 50 మందికి గాయాలయ్యాయి.

09/20/2018 - 00:27

పి.వి. రమణారావు

09/20/2018 - 00:37

విజయవాడ, సెప్టెంబర్ 19: ఇంధన రంగంలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంలో ఏపీ చేపట్టిన చర్యలు మరో 10 అవార్డులను చేజిక్కించుకునేలా చేశాయి. ఈ-మెజర్‌మెంట్ బుక్‌కు సంబంధించి ఏపీ ట్రాన్స్‌కోకు 2018 స్కోచ్ అవార్డు

09/20/2018 - 00:22

అమరావతి, సెప్టెంబర్ 19: ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలులో కేంద్రం వ్యవహారశైలి బ్రిటీష్ పాలకులను తలపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే చరిత్రలో కలసిపోతారని మండిపడ్డారు.

09/19/2018 - 16:02

నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్యకేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మను.. పోలీసులు బీహార్ నుంచి నల్గొండకు తీసుకువచ్చారు. శర్మతో పాటు మిగతా నిందితులను బుధవారం సాయంత్రం మిర్యాలగూడ కోర్టులో హాజరుపర్చనున్నారు.

09/19/2018 - 12:43

విశాఖపట్నం: తొలితరం కమ్యూనిస్టు నాయకురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ (100) కన్నుమూశారు. విశాఖపట్నంలో నివాసముంటున్న ఆమె మనుమరాలు అనురాధ ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ ఆగస్టు 5వ తేదీన వంద సంవత్సరాల జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. అనారోగ్యానికి గురైన ఆమె చికిత్స తీసుకుంటూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

09/19/2018 - 06:53

హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ద్వారా నిర్వహించే ఐఐటి జేఈఈ, నీట్, యూజీసీ నెట్, సీమ్యాట్, జీ ప్యాట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు కేంద్ర ప్రభుత్వం ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో 3406 పట్టణాల్లో 2,72,348 కంప్యూటర్లను నెలకోల్పుతోంది. ప్రవేశపరీక్షలకు పేర్లను నమోదుచేసుకున్న వారు ఈ కేంద్రాలకు వెళ్లి తమ ప్రాక్టీసు ప్రారంభించవచ్చు.

09/19/2018 - 04:12

అమరావతి, సెప్టెంబర్ 18: రాష్ట్రాలు బలపడాలంటే కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. బెంగుళూరు విధానసౌధలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన 28వ దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి యనమల హాజరయ్యారు.

Pages