S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/07/2018 - 05:39

తుంగతుర్తి, జూలై 6: దేశంలో 55ఏళ్ల పాటు కొనసాగిన కుటుంబ పాలనకు చరమగీతం పాడడంలో భారతీయ జనతా పార్టీ పూర్తి విజయం సాధించిందని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. ఇదే ఈ విధానం తెలంగాణలో కూడా అమల య్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

07/07/2018 - 02:27

కర్నూలు, జూలై 6: కర్నూలు నగరంలో ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షప్రణీత్‌రెడ్డి(18) గురువారం రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప నగరానికి చెందిన రామాంజులురెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు.

07/07/2018 - 05:29

అమరావతి, జూలై 6: రాష్ట్రంలో త్వరలో నూతన ఐటీ విధానాన్ని అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆక్రమిత భూముల్లో నిర్మాణాలను నిర్ణీత గడువుతో క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విధానం 2014-2020ను 2018-20గా మార్పుచేస్తూ తీర్మానించింది.

07/07/2018 - 05:32

అమరావతి, జూలై 6: మరో పదిరోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల ఆరున విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని వివరించారు. పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

07/07/2018 - 05:31

విశాఖపట్నం, జూలై 7: అడ్డూ అదుపులేకుండా బడా పారిశ్రామిక వేత్తలకు ఇష్టానుసారం దోచిపెట్టేందుకు జరుగుతున్న భూ సేకరణను అడ్డుకునేందుకు సంయుక్త కార్యాచరణ (జేఏసీ) నేతృత్వంలో పోరాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, పరిశ్రమలు, సెజ్‌ల పేరిట లక్షలాది ఎకరాలు సేకరిస్తూ రైతులను నిర్వాసితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు.

07/07/2018 - 05:35

రాజమహేంద్రవరం, జూలై 6: గోదావరి నది కుడి, ఎడమ కాలువలు ఆధారంగా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు ఈ ఖరీఫ్ నుంచి పరవళ్లు తొక్కుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి, కృష్ణా డెల్టా, ఏలేరు ఆయకట్టుకు నీరు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

07/07/2018 - 05:43

హైదరాబాద్, జూలై 6: మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని, ఈ క్రమంలోనే వారికి ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. మూడు ప్రాంతాల్లో 200 ఎకరాలను మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించామని తెలిపారు.

07/07/2018 - 02:00

హైదరాబాద్, జూలై 6: టీ ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో శ్రీ చైతన్య డీన్ వాసు బాబుతో పాటు ఏజెంట్ కమ్మ వెంకట శివ నారాయణలు అరెస్టుతో సూత్రధారుల పునాదులు కదులుతున్నాయి. లీకేజీ నిందితులు తమ వెనుక ఉన్న పెద్ద తలకాయలపై నోరువిప్పుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరోపక్క ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.

07/07/2018 - 01:58

హైదరాబాద్, జూలై 6: వెనుకబడిన తరగతులు (బీసీ), అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) స్వయం ఉపాధికి అవసరమైన వ్యూహాలను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫారసులపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన సమావేశం కావాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు.

07/07/2018 - 01:56

హైదరాబాద్, జూలై 6: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆరుగురు పోలీసులపై విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర హోంశాఖ ఎత్తివేసింది. నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగు చూసిన అనేక అక్రమాలు, అక్రమార్జనలో పోలీసులకూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తొలుత విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం (సిట్) ఆరుగురు పోలీసులకు సంబంధం ఉన్నట్లు నివేదిక ఇచ్చింది.

Pages