S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/10/2018 - 00:17

శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 9: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం శ్రీకాకుళం రూరల్ మండలంలో మహిళలు, అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య కొనసాగింది. నగర శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర కొత్తరోడ్ జంక్షన్ మీదుగా పాలకొండ రోడ్‌లో రాగోలు సమీపంలోని దూసి రోడ్ వరకు కొనసాగింది. మార్గమధ్యలో ఎక్కడా ప్రసంగించడం, ఆగిన సంఘటనలు లేవు.

12/10/2018 - 00:14

విజయవాడ, డిసెంబర్ 9: గ్రామాల్లో ఇక ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందుబాటులోకి రానుంది. మంచినీటి సమస్య లేని పల్లెలే లక్ష్యంగా చేపట్టిన జలధార పథకం త్వరలో కార్యరూపం దాల్చనుంది. దాదాపు 22,300 కోట్ల రూపాయలతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ రూపొందించిన ఈ పథకం త్వరలో సాకారం కానుంది. ఇకపై ఏపీలోని చాలా ప్రాంతాల్లో వేసవిలో కూడా దాహం కేకలు వినిపించవు.

12/10/2018 - 00:09

అమరావతి, డిసెంబర్ 9: ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు సూచించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

12/10/2018 - 03:41

భద్రాచలం టౌన్, డిసెంబర్ 9: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగం గా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆదివారం భక్తులకు కూర్మావతారంలో దర్శనమిచ్చారు. ఈ రూపంలోస్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి నాళాయర దివ్యప్రబంధం చదివారు. మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ స్వామిని మిథిలా మండపానికి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

12/10/2018 - 00:04

అమరావతి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను స్తంభింప చేసేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది.

12/09/2018 - 04:57

హైదరాబాద్: తెలంగాణ సమాజం యావత్తూ ప్రజాఫ్రంట్ వైపే మొగ్గుచూపిందని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత స్ఫష్టంగా కనిపించిందని చెప్పారు. శనివారం ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖరరెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం, అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

12/09/2018 - 03:56

వెల్దండ, డిసెంబర్ 8: బీజేపీ నాయకుల చేతిలో గాయపడిన కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి తాజా, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తిరిగి అసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్నారు.

12/09/2018 - 03:55

వెల్దండ, డిసెంబర్ 8: విలక్షణ తీర్పులకు నిలయమైన కల్వకుర్తి అసెంబ్లీ స్థానం ఎవ్వరికో దక్కునుందోనని సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ఈ దఫా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి 15మంది బరిలో ఉన్నా ప్రధానంగా టీఅర్‌ఎస్ అభ్యర్థి గూర్క జైపాల్‌యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజి ఆచారిల మధ్యే పోటీ నెలకొందని చెప్పవచ్చు.

12/09/2018 - 03:55

సంగారెడ్డి, డిసెంబర్ 8: రెండు నెలల పాటు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించే విధంగా పోటీ పడి ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేసిన పార్టీలు తాజాగా గెలుపు, ఓటములపై బేరీజు వేయడంలో నిమగ్నమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంచనాలు కట్టడంలో నేతలు తలమూనకలయ్యారు.

12/09/2018 - 03:53

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 8: రాష్టమ్రంతటా అపద్ధర్మ సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రభంజనం ఉందని, తాను 25వేల నుండి 30వేల ఓట్ల మెజారిటితో గెలుపొందుతానని తెలంగాణ రాష్ట్ర సమితి మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.

Pages