S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/30/2018 - 17:45

విజయవాడ: వైకాపా అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర కృష్ణాజిల్లా నిమ్మకూరులో కొనసాగుతుంది. ఎన్టీయార్ జన్నస్థలమైన నిమ్మకూరులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తాము అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లాకు ఎన్టీయార్ జిల్లా అని నామకరణం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిమ్మకూరును అన్నివిధాల అభివృద్ధిచేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈసందర్భంగా ఎన్టీయార్ బంధువులు కొందరు వైఎస్ జగన్‌ను కలిశారు.

04/30/2018 - 17:55

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధానారాయణ మూర్తి సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. జేఈఓ శ్రీనివాసరాజు ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సుధానారాయణ మూర్తి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ పదవితో తనకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

04/30/2018 - 17:43

విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వైఖరి అవలంభిస్తున్నాయంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారంనాడు విశాఖపట్నంలో చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ ప్రారంభంమైంది. వైకాపా శ్రేణులు అత్యిధిక సంఖ్యలో పాల్గొన్నారు.

04/30/2018 - 12:29

జోగుళాంబ గద్వాల: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై ఉండవల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్‌ప్లాజా - అలంపూర్ చౌరస్తా మధ్య కారు బోల్తాపడింది. ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

04/30/2018 - 05:08

జనగామ టౌన్, ఏప్రిల్ 29: జనగామలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యమంతా తడిసిపోయింది. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మార్కెట్‌లో ఉన్న ధాన్యమంతా తడిసి ముద్దయింది.

04/30/2018 - 04:29

తాండూరు, ఏప్రిల్ 29: ప్రతి రోజు సాయంత్రం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరుతున్న గుల్బర్గా - హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 8.30 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. ఈ సమయం హైదరాబాద్ నుంచి తాండూరు మీదుగా గుల్బర్గా వరకు వెళ్లే ప్రయాణీకులకు అనుకూలంగా ఉంది.

04/30/2018 - 03:12

హైదరాబాద్, ఏప్రిల్ 29: ‘కల్లు..మా తల్లిలాంటిది. 40 ఏళ్లుగా మా కుటుంబానికి అదే జీవనాధారం’గా ఉంటోంది. అన్నాడు 70 ఏళ్ల వయస్సున్న చంద్రయ్య గౌడ్. ‘నాకు ముగ్గురు పిల్లలు. వారి పెళ్లిళ్లు కూడా చేశాను. రోజువారీ ఖర్చులు.. పెళ్లిళ్ల ఖర్చులు అన్నీ కల్లు తల్లే సమకూరుస్తోందంటూ ఆంధ్రభూమి ప్రతినిధితో అనందంగా చెప్పాడు.

04/30/2018 - 03:08

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి జయంత్యుత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉద యం బాలాలయంలోని యజ్ఞశాలలో శ్రీ నారసింహ హోమం నిర్వహించారు. మూ ల మంత్ర జపములు, పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసిన అనంతరం శ్రీ స్వామి, అమ్మవార్లకు సహస్త్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకులు, యాజ్ఞికులు వేద మంత్రాలతో, సన్నాయి మేళాలతో నిర్వహించారు.

04/30/2018 - 02:59

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానానికి చెందిన దుబ్బకుంటపల్లిలో గల శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం లో స్వామి, అమ్మవార్ల కల్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భూదాత మాడూరి నర్సింహస్వామి ఆధ్వర్యం లో జరిగింది.

04/30/2018 - 02:56

నాగార్జునసాగర్, ఏఫ్రిల్ 29: నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వత ఆరామా బుద్ధవనంలో ఆదివారం నాడు బుద్ధ పూర్ణిమ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2,562 బుద్ధజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Pages