S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/01/2018 - 04:35

హైదరాబాద్, మార్చి 31: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా యాప్‌ను సిద్ధం చేసినట్టు పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు. యాప్ ద్వారా మెంబర్ షిప్ ఏప్రిల్ 2 నుండి ప్రారంభం అవుతుంది. జనసేన ఆవిర్భావ మహాసభలో మిస్డ్ కాల్‌తో పార్టీ సభ్యులుగా ఎవరైనా చేరవచ్చని ప్రకటించిన తర్వాత ఇంత వరకూ 17 లక్షల మందికి పైగా జనసేనలో చేరారన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసైన్యం పేరుతో నిర్వహించనున్నారు.

04/01/2018 - 04:33

హైదరాబాద్: ఎవరి నుండి తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ అప్పారావును హత్య చేసేందుకు వ్యూహరచన జరిగిందని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చేసిన ప్రకటనపై ప్రొఫెసర్ అప్పారావు స్పందించారు.

04/01/2018 - 04:30

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలో రాజ్యాంగ సంరక్షకుడు గవర్నర్ నివసించే రాజ్‌భవన్ ఖర్చులు, గవర్నర్ జీత భత్యాల కింద తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ.21,17,55,000 కోట్లను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఉండడం వల్ల ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఖర్చును భరిస్తుంది.

04/01/2018 - 04:03

హైదరాబాద్, మార్చి 31: దేశంలో మహిళా రక్షణకు లెక్కలేనన్ని చట్టాలున్నా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఓబీసీ ఉప వర్గీకరణ జాతీయ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ జీ రోహిణి పేర్కొన్నారు.

04/01/2018 - 04:02

తిరుపతి, మార్చి 31: తిరుమలలో శ్రీవారికి మూడు రోజులుగా నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకలు కన్నుల పండువగా ముగిశాయి. ఇందు లో భాగంగా శనివారం మలయప్పతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సమే త ఆంజనేయ స్వామివారు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించా రు.

04/01/2018 - 04:17

ఒంటిమిట్ట/రాజంపేట, మార్చి 31: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భా రీగా భక్తులు తరలివస్తారని తెలిసినప్పటికీ తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టిన టీటీడీ భారీమూల్యాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

04/01/2018 - 04:22

ఒంటిమిట్ట, మార్చి 31: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి రథోత్సవం శనివా రం నయనానందకరంగా సాగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నా రు. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి కల్యాణం జరిగిన సంగతి తెలిసిందే.

04/01/2018 - 03:50

కడప, మార్చి 31: కడప జిల్లా అధికారులు, పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనె్నర్ర చేశారు. ఒంటిమిట్ట ఘటనతోపాటు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం, అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా అధికారులు, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్జీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అందరిపై చెడామడా కోప్పడ్డారు.

04/01/2018 - 02:28

* సుప్రీం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు

04/01/2018 - 03:18

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగంచడంలో మరో అడుగు ముందుకు వేసింది. ఒక జిల్లాకు చెందిన వినియోగదారుడు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్న రేషన్ దుకాణం నుండి రేషన్ తీసుకునే విధానం (పోర్టబులిటీ) ఆదివారం నుండి అమల్లోకి వస్తోంది. ఈ విధానం వల్ల 2.75 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోంది.

Pages