S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/01/2018 - 02:25

హైదరాబాద్, మార్చి 31:ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ మలి విడత బస్సు యాత్ర ఆదివారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభంకానున్నది. మార్చిలో బస్సు యాత్రను చేవెళ్ళ నుంచి ఆరంభించినా, ఎఐసిసి ప్లీనరీ,అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తాత్కాలికంగా దానికి బ్రేకు పడిన సంగతి తెలిసిందే.

04/01/2018 - 02:23

హైదరాబాద్, మార్చి 31: టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం రెడ్డి నేతృత్వంలో కొత్తగా పార్టీ ఆవిర్భవించబోతున్నది. సోమవారం పార్టీ పేరు, సిద్ధాంతాలను ఆయన ప్రకటించనున్నారు. 4న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 29న అట్టహాసంగా పార్టీ తొలి బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘తెలంగాణ జన సమితి’ పేరిట పార్టీని స్థాపించనున్నట్లు తెలుస్తోంది.

04/01/2018 - 02:21

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి నూతన పార్కింగ్ విధానం అమల్లోకి రానుంది. మాల్స్, మల్టీప్లెక్స్, ప్రైవేట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ దోపిడి పెచ్చుమీరుపోయింది. దీంతో ఈ విషయంపై పలు వార్త కధనాలు వెల్లువెత్తడం, న్యాయస్థానం సైతం పార్కింగ్ విషయంపై దృష్టి సారించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

04/01/2018 - 02:19

ఒంటిమిట్ట, మార్చి 31: కడప జిల్లా ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సానికి రేకులు మీదపడి మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ప్రభుత్వపరంగా రూ.15 లక్షలు చొప్పున సీఎం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు జిల్లా ఇంచార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటిమిట్టలో పర్యటించిన ఆయన ఆలయ పరిసరాల్లో జరిగిన విధ్వంసాన్ని తిలకించారు.

04/01/2018 - 02:55

అనంతపురం మార్చి 31: రాష్ట్భ్రావృద్ధి, ప్రజాసంక్షేమం, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు ఆగదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా సాధనకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

04/01/2018 - 02:58

మేడికొండూరు, మార్చి 31: పార్లమెంటు సమావేశాల చివరి రోజున వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

04/01/2018 - 03:20

హైదరాబాద్, మార్చి 31 వ్యవసాయాన్ని రైతాంగానికి ఆచరణీయంగానూ, లాభదాయకంగానూ, సుస్థిరంగా మలిచే బాధ్యత వ్యవసాయ శాస్తవ్రేత్తలదేనని ఉప రాష్టప్రతి ఎమ్.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేయడం అనే అంశంపై ఐసిఎఆర్ , ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చి సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు ఉప రాష్టప్రతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

04/01/2018 - 03:08

* ప.గో. జిల్లాలో వినూత్న నిరసన హోదా కావాల్సిందేనని పట్టు
* నీరు, మట్టి కుండలతో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు

04/01/2018 - 04:28

హైదరాబాద్, మార్చి 31: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాలపై ఎటువంటి చర్చలు జరగడం లేదని, సొంత ప్రయోజనాలకు అసెంబ్లీని వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రతిపక్షం లేదనే ధైర్యంతో టిడిపి అసెంబ్లీలో విపక్ష పార్టీలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందన్నారు.

03/31/2018 - 18:07

విశాఖపట్నం: ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో నకిలీ నోట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. బెంగాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కర్నాటక ఎన్నికల్లో పంచేందుకు 10.20 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని విశాఖ వద్ద అదుపులోనికి తీసుకున్నారు.

Pages