S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/31/2018 - 04:08

అనంతపురం: కళల కాణాచిగా విరాజిల్లుతూ, అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని సొంతం చేసుకున్న, చారిత్రక ప్రాధాన్యం కలిగిన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని చాటుతూ నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలు-2018 నేటి నుంచి రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

03/31/2018 - 04:05

హైదరాబాద్, మార్చి 30: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 45 రైల్వే స్టేషన్లలో ‘వై ఫై’ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే వెల్లడించింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేకు ఇవ్వగా ఒక్క రోజు ముందుగానే సాధించినట్లు తెలిపింది.

03/31/2018 - 04:44

హైదరాబాద్, మార్చి 30: దేశంలో అత్యాచారాలు ఆపడానికి చట్టసభల్లో బిల్లులు చేస్తే సరిపోదని వాటిని తప్పక అమలుచేయాలని ఉప రా ష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చందానగర్‌లోని మహిళా దక్షత సమితి రజతోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైనా సంస్థను, ట్రస్టును స్థాపించడం కం టే వాటిని నడపడం చాలా గొప్పవిషయమని అ న్నారు.

03/31/2018 - 04:13

తిరుపతి, మార్చి 30: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవా రం ఉదయం మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథం పై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందు లో భాగంగా 8 నుంచి 9 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన ఈ స్వర్ణరథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ స్వర్ణరథాన్ని లాగారు.

03/31/2018 - 03:49

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజకీయాలను పక్కనపెట్టి పోరాటం చేసేందుకు టిడిపి ఎంపీలు ముందుకు రావాలని వైకాపా ఎంపి పి మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమం కీలక దశలో ఉందని, రాష్ట్రప్రజల భవిష్యత్తు కోసం టిడిపి ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడాలన్నారు.

03/31/2018 - 03:48

నెల్లూరు టౌన్, మార్చి 30: తాను మరణించినా అవయవదానం ద్వారా మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు లు నింపిన సంఘటన నెల్లూరు నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా వాకాడు మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన రాయపు శ్రీనివాసులు (45) బుధవారం మోటారుబైక్‌పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా తమ హాస్పిటల్‌కు తీసుకొచ్చారని సింహపురి వైద్యశాల చైర్మన్ కా టంరెడ్డి రవీంద్రరెడ్డి తెలిపారు.

03/31/2018 - 03:47

హైదరాబాద్, మార్చి 30: జనసేన జిల్లాల కమిటీల నియామకం, పార్టీని విస్తృతపరచడం, మానిఫెస్టో రూపకల్పనపే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మేధావులు, వివిధ వర్గాల వారు , కామన్‌మెన్ ప్రొటక్షన్ ఫోర్సు సేవా సంస్థ నుండి పవన్‌కళ్యాణ్‌ను అనుసరిస్తున్న వారు, గత నాలుగేళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న వారిని కలిసి చర్చిస్తున్నారు. గత వారం రోజులుగా ఉదయం నుండి సా యంత్రం వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

03/31/2018 - 04:15

* ఒంటిమిట్టలో
నేత్రానందంగా
కోదండరాముడి కల్యాణం
* ప్రభుత్వం తరఫున
పట్టువస్త్రాలు, ముత్యాల
తలంబ్రాలు సమర్పించిన
సీఎం చంద్రబాబు

03/31/2018 - 03:11

హైదరాబాద్, మార్చి 30: గిరిజన తండాలను అద్దాలుగా తీర్చిదిద్దుదామని సీఎం కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. గిరిజన ఉప ప్రణాళికకు ఐదేళ్లలో కేటాయించే దాదాపు రూ. 36 వేల కోట్లతో పేదరికాన్ని శాశ్వతంగా పారద్రోలవచ్చన్నారు.

03/31/2018 - 02:48

హైదరాబాద్, మార్చి 30: అసెంబ్లీ సమావేశాలను టిఆర్‌ఎస్ పార్టీ సమవాశాలుగా మార్చి వేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలు కుటుంబపాలనగా కొనసాగాయన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ విధానాల అమలుతీరు, నిధుల వ్యయంపై ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చట్టసభల నుంచి గెంటివేయించారన్నారు.

Pages