S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/30/2018 - 04:23

రాజమహేంద్రవరం, మార్చి 29: సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి రావాల్సిన జలాలను ఎపుడో వాడేశాం.. దీనికి తోడు విద్యుత్ ఉత్పత్తిని బైపాస్ చేసి మరీ అదనపు జలాలను కూడా వాడేసుకున్నాం. మరో 10 రోజుల వరకు అంటే దాదాపు ఏప్రిల్ 10 వరకు కచ్చితంగా నీరు తప్పనిసరి. గోదావరి నదిలో సహజ నీటి లభ్యత పూర్తిగా అడుగంటింది. ఈ నేపథ్యంలో రబీ వరిని జల సంక్షోభం వెంటాడుతోంది.

03/30/2018 - 04:20

హైదరాబాద్, మార్చి 29: వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలో నిర్మించ తలపెట్టిన రైల్వే వ్యాగన్ల ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ అత్యధిక ప్రాధాన్యతతో కూడిన అంశంగా భావించి రెవెన్యూ అధికారులు వేగంగా భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి ఆదేశించారు.

03/30/2018 - 04:19

హైదరాబాద్, మార్చి 29: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పలువురు నేతలతో టీఆర్‌ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ చర్చల జరుపుతున్న నేపథ్యంలో గురువారం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ భేటీ అయ్యారు. బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య అనంతరం ప్రధాని మంత్రి మోదీపై, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రకాశ్‌రాజ్ సీఎం కేసీఆర్‌ను కలువడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

03/30/2018 - 03:48

హైదరాబాద్, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుపై వామపక్షాలతో కలిసి ఐక్య కార్యాచరణ పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వచ్చేవారం ఆంధ్రాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 4వ తేదీన వివిధ పక్షాల నేతలతో మరోసారి సంభాషించి తదుపరి ఉద్యమ కార్యాచరణకు ఒక రూపాన్ని ఇవ్వనున్నట్టు తెలిసింది.

03/30/2018 - 03:19

తిరుపతి, మార్చి 29: తిరుమలలోని ఏటా శ్రీవారికి నిర్వహించే వార్షిక వసంతోత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. గురువారం ఉదయం 7గంటల కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా పడమర వీధిలోని వసంతమండపానికి వేంచేపు చేశారు.

03/30/2018 - 03:16

న్యూఢల్లీ, మార్చి 29: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. కాగా ఈ ఏడాది వడగాడ్పులు ఏటాకంటే ముందుగానే దేశాన్ని కుదిపేస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఛండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

03/30/2018 - 03:14

సూళ్లూరుపేట, మార్చి 29: దేశ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. గురువారం షార్ కేంద్రం నుంచి ప్రయోగించి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్ కంట్రోలర్ సెంటర్ నుంచి మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది షార్ కేంద్రం నుంచి మరో 9 ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

03/30/2018 - 04:04

ఒంటిమిట్ట, మార్చి 29: కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరాముడి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కన్నుల పండువగా జరుగనుంది. శ్రీరామచంద్రుడు సీతమ్మతల్లి మెడలో మాంగల్యధారణగావించే సుందర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కల్యాణోత్సవానికి ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

03/30/2018 - 03:59

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండుబిల్లులపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్వయంగా సమాధానాలు ఇచ్చారు.

03/30/2018 - 02:48

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షింతలు వేసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున గురువారం సభలో ‘కాగ్’ తన నివేదికను సమర్పించింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని కాగ్ తప్పుపట్టింది.

Pages