S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/19/2018 - 01:46

కామారెడ్డి, సెప్టెంబర్ 18: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అణు పరిశోధనల కోసం రూపాంతరం చెందుకుని సిద్ధంగా ఉంది రీసెర్చ్ అణు రియాక్టర్ ‘అప్సర’. రియాక్టర్లే అణుపరమాణుశక్తికి వెన్నముకలుగా నిలుస్తాయని, 1950లోనే భారత అణుశక్తి పితామహుడు హూమి జహంగీర్‌బాబా చెప్పిన విషయాలన్ని ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఇంతే కాకుండా ఆయన ముందు చూపుతో చేసిన సూచనలు ఇప్పుడు భారతదేశ ముఖ చిత్రానే్న మారుస్తున్నాయి.

09/19/2018 - 00:41

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 18: ప్రభుత్వం, పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హత్యకు గురైన దళిత యువకుడు పి.ప్రణయ్‌కుమార్ భార్య అమృతవర్షిణి, తమ్ముడు అజయ్‌కుమార్, తల్లిదండ్రులు హేమలత, బాలస్వామిలు అన్నారు.

09/19/2018 - 04:48

హైదరాబాద్: ‘అందరూ ఐక్యంగా పని చేయండి... ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోండి’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ తెలంగాణ నాయకులకు పిలుపునిచ్చారు. కర్నూలులో మంగళవారం ఏపీసీసీ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం ఢిల్లీ వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

09/19/2018 - 00:35

హైదరాబాద్, సెప్టెంబర్ 18: వచ్చే ఎన్నికల్లో పోటీకి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థులలో చేర్పులు, మార్పులకు అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ చేర్పులు, మార్పులు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

09/19/2018 - 00:34

హైదరాబాద్, సెప్టెంబర్ 18: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, అవుట్ సోర్సింగ్, పెన్షనర్లు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారని టీఆర్‌ఎస్ వచ్చాక వారిపట్ల కిరాతంగా వ్యవహిరించిందని ఆయన ఆరోపించారు.

09/19/2018 - 04:54

హైదరాబాద్: విద్యుత్‌శాఖలో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోవడం పట్ల అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవీయతతో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించడం ఆనందకరమని సీఎం వ్యాఖ్యానించారు.

09/19/2018 - 04:52

ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై మంగళవారం ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్, ఖమ్మంల్లోని కార్యాలయాలు, ఇళ్ళతో పాటు ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలోని ఇంటిపై కూడా దాడులు చేశారు. అలాగే ఆయనకు సన్నిహితంగా ఉండే పలువురు కాంట్రాక్టర్ల ఇళ్ళపై కూడా సోదాలు నిర్వహించారు.

09/19/2018 - 04:53

విజయవాడ: నూతన ఆవిష్కరణలను జీవితంలో భాగంగా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ చాంఫియన్స్ వార్షిక సదస్సులో మంగళవారం అసెంబ్లీ ఆఫ్ సిటీ లీడర్స్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, నూతన ఆవిష్కరణ ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన అంశాలపై ఫోరం సభ్యులతో మంత్రి భేటీ ఆయ్యారు.

09/19/2018 - 00:27

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: జనం మెచ్చిన నేతను జనం ఎన్నుకుంటారు. భీమవరం ప్రాంతానికి చెందిన కేవీఎస్ కార్తీక్ అనే వ్యక్తిత్వ వికాస శిక్షకుడు జగన్‌ను కలిసి తాను రచించిన ‘యూ ఆర్ సెలెక్టెడ్’ పుస్తకాన్ని బహుకరించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో పాదయాత్ర మంగళవారం ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో అభిమానులు జగన్‌తో పాదం కలిపారు.

09/19/2018 - 00:24

కర్నూలు, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రజలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ దేశం ఆంధ్రప్రదేశ్‌కు రుణపడి ఉందని కొనియాడారు.

Pages