S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/29/2018 - 12:33

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ గురువారం కలిశారు. ఇటీవల పద్మశ్రీ అందుకున్న శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. వాటిని చంద్రబాబు ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు అందజేశారు.

03/29/2018 - 12:19

హైదరాబాద్: ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేస్తామని, దశలవారీగా అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామని రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

03/29/2018 - 11:51

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా విశ‍్విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (గురువారం) రామకృష్ణ హర్టీ కల్చరల్‌ సినీ స్టూడియోలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బిజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

03/29/2018 - 05:25

విశాఖటప్నం, మార్చి 28: విశాఖ ఐటీ చరిత్రలో మరో కీలక ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరగనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ, ఇన్నోవా సొల్యూషన్స్ సంయుక్తంగా సుమారు 450 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సైన్స్ విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. 51 లక్షల కోట్లతో నడుస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తన శాఖను ఏర్పాటు చేయబోతోంది.

03/29/2018 - 04:37

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును విపక్షాల వాకౌట్ల మధ్య శాసనసభ బుధవారం సాయంత్రం ఆమోదించింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని బిజెపి, టిడిపి డిమాండ్ చేయగా, బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది.

03/29/2018 - 04:34

హైదరాబాద్, మార్చి 28: తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం టైర్ రన్‌వేపై పేలి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ సంఘటనతో విమానంలోని 120 మంది ప్రయాణీకులు చాలా ఆందోళన చెందారు. ఈ విమానంలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఉన్నారు. సుమారు రెండుగంటలపాటు విమానం రన్‌వేపై నిలిచిపోవడం, ద్వారం తెరుచుకోకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

03/29/2018 - 04:32

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ముగియగానే వచ్చే నెల 1 నుంచి మలి విడత బస్సు యాత్ర చేపట్టాలని టి.పిసిసి నిర్ణయించింది. బుధవారం గాంధీ భవన్‌లో బస్సు యాత్ర రెండో విడతకు సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.

03/29/2018 - 05:09

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని పరిశ్రమల కాలుష్యం నుంచి రక్షిస్తామని, వచ్చే మూడు నెలల్లో నగరం నుంచి వంద పరిశ్రమలను శివార్లకు తరలిస్తామని మున్సిపల్ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే 400 ఫార్మా పరిశ్రమలను తరలిస్తామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 185 చెరువులు ఉన్నాయని చెప్పారు.

03/29/2018 - 05:10

హైదరాబాద్, మార్చి 28: పంచాయతీలకు ప్రస్తుత విధానం ప్రకారమే ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనసభలో పంచాయతీరాజ్ బిల్లును ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన సందర్భంగా బిల్లులోని ముఖ్యాంశాలను శాసనసభ పక్షం కార్యాలయంలో మీడియాకు మంత్రి జూపల్లి వివరించారు. అలాగే ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండబోవన్నారు.

03/29/2018 - 05:04

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందుతున్న సాయం, పునరావాసంపై జాతీయ ఎస్టీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రం అమలు చేస్తున్న ఆర్‌ఆర్ ప్యాకేజీపై కేంద్రానికి త్వరలో సానుకూలంగా నివేదిక ఇస్తామని బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి చెప్పారు.

Pages