S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/27/2018 - 12:46

అమరావతి: ప్రత్యేకహోదా సాధన, కేంద్ర సాయంపై చర్చించేందుకు అఖిల పక్ష, , ఇతర సంఘాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం సమావేశమైంది. సచివాలయంలోని బ్లాక్‌-1లో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదుగురు మంత్రులు హజరయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంక్రటావు, మండలి చీఫ్‌‌ విప్ పయ్యావుల కేశవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్ల రామయ్య హజరయ్యారు.

03/27/2018 - 04:31

హైదరాబాద్: ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆయన రాజీనామాపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాల సమాచారం.

03/27/2018 - 02:27

హైదరాబాద్, మార్చి 26: కృష్ణాజలాలు పాలమూరు పొలాలకు తరలుతుండటంతో దశాబ్దాల తరబడి బీడుగావున్న పంటపొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలతో మూడేళ్ల నుంచి పాలమూరు జిల్లాలోని పొలాలకు సాగునీరు అందుతోంది.

03/27/2018 - 04:50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుపై వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ ఐక్య పోరాటం చేస్తుందని, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ మాటలు మారుస్తోందని, బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వైసీపీ బలంగా పోరాటం చేయలేకపోతోందని అన్నారు.

03/27/2018 - 04:50

శ్రీకాకుళం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏవోబీలో మళ్ళీ తుపాకీల మోత వినిపించింది. ఆంధ్ర -ఒడిశా ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్, కూంబింగ్ నిరంతరం సాగుతునే ఉంది. అయినప్పటికీ, ఆదివారం రాత్రి నలుగురు మావోయిస్టులు కొరాపుట్ జిల్లా వలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్) కాల్పుల్లో మృతి చెందారు.

03/27/2018 - 02:16

ఖమ్మం, మార్చి 26: కమనీయ కల్యాణాన్ని తిలకించిన కనులే కన్నులు.. ఆ ‘కల్యాణ’మూర్తులకు ప్రణమిల్లిన చేతులే చేతులు.. ఆణిముత్యాలే తలంబ్రాలైన వేళ.. ‘జయ జయ రాం.. సీతారాం’ అంటూ భక్తులు చేసిన నినాదాలే మంగళ వాయిద్యాలైన వేళ.. రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకాలు పెళ్లి లాంఛనాలైన వేళ.. భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. చలువ పందిళ్లు..

03/27/2018 - 02:17

అమరావతి, మార్చి 26: కేంద్రంపై పోరాడుతున్న సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకుని బీజేపీకి షాక్ ఇచ్చారు. హోదా, ప్యాకేజీ సహా రాష్ట్రానికి రావలసిన హక్కులపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, హోదా కోసం పోరాడుతున్న సంఘాలు, సంస్థలతో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీ తర్వాత అందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లి, హోదాను జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

03/27/2018 - 02:07

హైదరాబాద్, మార్చి 26: కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అడ్డుతగులబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రకటించింది. అవిశ్వాసంపై చర్చ జరిగితే సహకరిస్తామని కూడా స్పష్టంచేసింది. ప్రగతి భవన్‌లో సోమవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

03/27/2018 - 03:30

శ భద్రాచలం రాములోరికి టీటీడీ పట్టు వస్త్రాలు
* నాలుగేళ్లలో 2 లక్షల వివాహాలు* రాజకీయ నేతల మధ్య బాంధవ్యాలు
* ఏపీ సాహితీవేత్తలకు సన్మానం

03/27/2018 - 02:04

గుంటూరు, మార్చి 26: ప్రత్యేక హోదా చివరి అంకంలో భాగంగా రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 6న పార్లమెంటు సమావేశాలు ముగిసేరోజున రాజీనామా చేయాల్సి ఉంది. అయితే

Pages