S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/16/2018 - 00:45

హైదరాబాద్/న్యూఢిల్లీ,మార్చి 15: తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్ కుమార్ గురువారం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను విచారిస్తామని, వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

03/16/2018 - 00:43

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు, రాష్ట్రానికి ఉన్న అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కూర్పు జరిగిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

03/16/2018 - 00:41

హైదరాబాద్, మార్చి 15: అనేక ప్రతికూల పరిస్థితులు, అస్పష్టతలు, అనుమానాలు, సవాళ్ల మధ్య ఏర్పడిన తెలంగాణ నూతన రాష్ట్రం అనతికాలంలోనే అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిందని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 2018-19వ సంవత్సరానికి రూ 1,74,453.83 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

03/16/2018 - 03:07

అమరావతి: హోదా అంశంలో తనను ప్రజల దృష్టిలో ముద్దాయిగా నిలబెట్టేందుకు వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పైఎత్తు వేసింది. హోదాపై చిత్తశుద్ధి ఉంటే తాము కేంద్రంపై పెట్టే అవిశ్వాసానికి మద్దతునివ్వాలంటూ గత కొద్దిరోజుల నుంచి వైసీపీ చేస్తున్న సవాల్‌ను స్వీకరించి, ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. లోక్‌సభలో వైసీపీ హోదా అంశంపై ఇచ్చే అవిశ్వాసానికి మద్దతునివ్వనుంది.

03/16/2018 - 00:36

అమరావతి, మార్చి 15: ‘ఎన్నారైలు అనగానే డబ్బులు పిండేద్దాం అనుకుంటున్నారు.. ఆ పద్ధతి పోవాలి. మీ నుంచి జనసేన పార్టీకి కావలసింది మేధో సహకారం’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. పార్టీ ఎన్నారై విభాగం ఎప్పటికప్పుడు ప్రవాస తెలుగు ప్రజలకి తోడ్పాటుగా ఉంటుందనీ, అలాగే విదేశాల్లో ఉన్న తెలుగువారు రాష్ట్రానికి ఏమి చేయాలో ఆలోచన చేయాలని చెప్పారు.

03/16/2018 - 03:09

కాకినాడ: మూడు సంవత్సరాలుగా వెనుకబడిన జాబితాలో స్థానం కోసం వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు సాగిస్తోన్న కాపు జేఏసీ మార్చి 31వ తేదీ తర్వాత తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 31వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌లోని కాపులను బీసీలుగా ప్రభుత్వం ప్రకటించని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీన ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా జేఏసీ సాగుతోంది.

03/16/2018 - 02:58

అమరావతి: కేంద్రం నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇక ఎన్డీయే నుంచీ బయటకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం వ్యతిరేక శక్తులను తెరవెనుక నుంచి కూడగట్టి, తనపై ఉసిగొల్పుతున్నందున, ఇంకా ఎన్డీయేలోనే ఉండటం వ్యూహాత్మక తప్పిదమవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

03/16/2018 - 00:23

అమరావతి, మార్చి 15:తెలుగుదేశం పార్టీని, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయాలని పెద్ద కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చాలా మంది పెద్దలు, స్థానికంగా కొందరి ప్రమేయంతో జరుగుతున్న ఈ కుట్రలో భాగస్వాములందరినీ ప్రజలు తిరస్కరిస్తారని ఉద్ఘాటించారు. ఎన్నో కుట్రలను తెలుగుదేశం పార్టీ సమర్థంగా ఎదుర్కొని విజేతగా నిలిచి ప్రజామోదం పొందిందన్నారు.

03/16/2018 - 02:57

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాలుగేళ్లలోపలే జిడిపిలో 14.1 శాతం వృద్ధిరేటును సాధించింది. 2016-17లో రాష్ట్ర జిడిపి రూ. 6,41,985 కోట్లు ఉంటే, 2017-18లో ఈ మొత్తం రూ.7,32,657 కోట్లకు చేరుకుంది. జాతీయ జిడిపిలో తెలంగాణ రాష్ట్ర జిడిపి వాటా 2013-14లో 4.02 శాతం ఉంటే, 2017-18లో రాష్ట్ర వాటా 4.37 శాతానికి పెరిగింది.

03/15/2018 - 17:36

హైదరాబాద్: అమరుల కుటుంబాలకు గతంలో ఇస్తామన్న భూములు, ఉద్యోగాు ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో గురువారం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ ఛాట్‌ చేశారు. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేసీఆర్ తప్పుడు లెక్కలు, మాయ మాటల బడ్జెట్‌తో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

Pages