S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/15/2018 - 17:23

అమరావతి: తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను
అభినందిస్తూ శాసనసభలో మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుడిగా జీవితం ప్రారంభించి ఇన్నేళ్లు ఉండటం గొప్ప విషయమని యనమల అన్నారు. సీఎంగా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.

03/15/2018 - 17:20

అమరావతి: తన తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబునాయుడికి వచ్చినంత పేరు తనకు వస్తుందో రాదో తెలియదు కానీ, వారికి ఏనాడూ చెడ్డపేరు మాత్రం తీసుకురానని ఏపీ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. గురువారం నారాచంద్రబాబునాయుడు 40ఏళ్ల రాజకీయ జీవితంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. ఆయన ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనుక మా అమ్మగారి కృషి ఎంత గానో ఉందన్నారు.

03/15/2018 - 16:27

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ శాసనసభ్యురాలు డికె అరుణ అన్నారు. ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించటంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు అసెంబ్లీలో ఏమి జరిగిందని వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. స్వామిగౌడ్‌కు హెడ్‌సెట్ తగలలేదని, ఒకవేళ తగిలి ఉంటే ఆ విజూవల్స్ ఎందుకు చూపించటం లేదని ఆమె నిలదీశారు.

03/15/2018 - 16:24

అమరావతి: తెలుగుదేశంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. ఏన్డీఏ నుంచి వైదొలగాలని, అలాగే వైసీపీ ఏన్డీఏ ప్రభుత్వంపై చేపట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టే ప్రతి చర్యకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.

03/15/2018 - 13:54

అమరావతి: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీపైన, లోకేష్‌పై చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. హోదా కోసం కలిసికట్టుగా వెళుతున్న తరుణంలో పవన్ ఇలా మాట్లాడటం దేనికి సంకేతాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అన్నారు.

03/15/2018 - 13:52

అమరావతి: పవన్ కల్యాణ్ ఆరోపణలు వెనుక బీజేపీ హస్తం ఉందని ఏపీ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిన్న తెలుగుదేశంపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వాస్తవాలు లేకుండా లోకేష్‌పై ఆరోపణలు చేయటం తగదని అన్నారు. ఆలోచనలు లేకుండా పవన్ ఆవేశంతో మాట్లాడుతున్నారని ఆయన దుయ్యపట్టారు.

03/15/2018 - 13:50

అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశాన్ని, ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు ఉదయం ఎంపీలు, సమన్వయ కమిటీ సభ్యులతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని, ఎన్నో కుట్రలను దాటుకుని వచ్చామని, రాష్ట్రంలో బలమైన పార్టీ క్యాడర్ ఉందని ఆయన అన్నారు.

03/15/2018 - 12:23

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 5,38,867 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 31 జిల్లాల్లో 2,542 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి 148 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు.

03/15/2018 - 12:15

హైదరాబాద్: 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ఈటెల ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదు ప్రజాకర్షక బడ్జెట్ అని తెలిపారు. మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు. రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు. కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు.

03/15/2018 - 04:32

హైదరాబాద్: భారత రైల్వేల్లో అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్, గ్రూప్-డి పోస్టులకు విడుదల చేసిన వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 98,238 పోస్టులను భర్తీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించగా, ఇప్పటికే ఆ పోస్టులకు కోటిన్నరకు పైగా అభ్యర్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా కోటి మందికి పైగా అపుడే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుండి ఆరులక్షలకు పైగా దరఖాస్తులు రైల్వే శాఖకు అందాయి.

Pages