S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/15/2018 - 00:49

అమరావతి, మార్చి 14: రాష్ట్రంలో ఇకపై ప్రతిపక్ష పాత్ర కూడా తెలుగుదేశం పార్టీనే పోషించాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీలో ఆయన ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు కొన్ని సూచనలు చేశారు. బీసీ, మైనారిటీ, గిరిజనులకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

03/15/2018 - 00:47

కర్నూలు, మార్చి 14: కర్నూలు పోలీసులు పాత తుపాకులను బుధవారం ధ్వంసం చేశారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరుల నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 1587 తుపాకులను కర్నూలు పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలో రోడ్డు రోలర్‌తో తొక్కించి పనికారాకుండా చేశారు. అనంతరం గొయ్యి తవ్వి వాడిని పూడ్చిపెట్టారు.

03/15/2018 - 00:37

గుంటూరు, మార్చి 14: రాష్ట్రానికి ప్రత్యేకహోదా.. ప్యాకేజీలపై మీరు ప్రధానమంత్రి మోదీని ప్రశ్నించే పరిస్థితుల్లోలేరు. కారణం మీ కుమారుడు లోకేష్ అవినీతిలో కూరుకుపోవటమే. మీతో సహా కొందరు టీడీపీ ఎమ్మెల్యేల భూ దాహానికి అంతులేకుండా పోతోంది. మీరు చెప్పేది మూడు మాటలైతే అందులో ఆరు అబద్ధాలు కనిపిస్తున్నాయి. తవ్వినకొద్దీ అవినీతి వెలుగుచూస్తోంది. ఇంకా ఎంత కాలం ఈ మోసం.

03/14/2018 - 18:03

గుంటూరు: జనసేన ఆవిర్భావ సభ మంగళగిరి సమీపంలో ఈ రోజు ప్రారంభమైంది. భారీ ఎత్తున జనసేన అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఐదుగురు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనసేన అధినేత సభాప్రాంగణానికి చేరుకున్నారు.

03/14/2018 - 16:10

హైదరాబాద్: ప్రభుత్వ లక్ష్యాలు గవర్నర్‌ ప్రసంగంలో ప్రతిబింభించాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నెలకు వచ్చే ఆదాయం రూ.10,500కోట్లని సీఎం చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.1.42లక్షల కోట్లని, రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ అప్పు రూ.72వేల కోట్లు ఉందన్నారు.

03/14/2018 - 14:17

హైదరాబాద్: ప్రముఖ భౌతిక మేధావి స్టీఫెన్ హాకింగ్ మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. భౌతిక విషయాలపై అనేక పరిశోధనలు చేసి మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారని చంద్రశేఖర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

03/14/2018 - 14:17

అమరావతి: ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై ఇక రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోరాటం ఉధృతం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారంనాడు ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు వేదికగా ఇపుడు పోరాటం చేయాలని, ఆర్థిక బిల్లులపై చర్చ జరిగేటపుడు ప్రత్యేక హోదా, ఆర్థికలోటుపై చర్చ జరపాలని నిర్ధేశించారు. సభకు ఎవ్వరూ గైర్హాజరు కావద్దని, ప్రజల గొంతు వినిపించాలని అన్నారు.

03/14/2018 - 12:47

హైదరాబాద్: లెండి ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలోని 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

03/14/2018 - 12:28

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాష్ట్రంలో చేపడుతున్న భూగర్భ గనులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీష్‌రెడ్డి సమాధానమిస్తున్నారు.

03/14/2018 - 12:22

అర్వపల్లి: ఇద్దరు మహిళల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చివరకు విషాదంగా ముగిసింది. సూర్యాపేట అర్వపల్లి మండలం ఉయ్యాలవాడలో సరోజ (25), గట్టమ్మ (26) బుధవారం తెల్లవారుజామున ఇద్దరు పరస్పరం తగువులాడుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Pages