S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/26/2015 - 05:29

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక అవసరాల కోసం, వరద సాయంగా కేంద్రప్రభుత్వం 700 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వరద సాయం కింద తక్షణమే వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం సైతం వరద సాయం ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాసింది.

11/26/2015 - 05:23

హైదరాబాద్, నవంబర్ 25: పోలీసులు, సైబర్ నిపుణుల కళ్లుగప్పి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాదులు తమ సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు. మొదటి నుంచి హైదరాబాద్ పరిసరాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉగ్రవాద సానుభూతిపరులున్న ప్రాంతాలుగా ముద్రపడటంతో, వీరి కదలకలపై పోలీసులు నిఘా పెంచారు.

11/26/2015 - 05:21

గుంటూరు, నవంబర్ 25: జలసంపద, పచ్చదనం, అభివృద్ధి మేళవించిన సుందర రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా మమేకం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలోనూ ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు.

11/25/2015 - 16:05

హైదరాబాద్ : ప్రజలు విశ్వసించేలా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతామని తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఆయన బుధవారంనాడు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లలో సాగునీరు అందిస్తే కేసీఆర్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తానని తాను చేసిన మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఓటమిని విశే్లషించుకుని ముందుకు సాగుతామని చెప్పారు.

11/25/2015 - 16:02

హైదరాబాద్ : సాగునీటి పనుల్లో అధికారులు జాప్యం చూపొద్దని, సత్వరమే పనులు పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారంనాడు వాటర్‌గ్రిడ్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇంటింటికి మంచినీరు అందించకుంటే ఓట్లు అడగమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కాబట్టి అధికారులు వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని అన్నారు.

11/25/2015 - 16:00

హైదరాబాద్‌ : మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో పౌల్ట్రీ ఇండియా-2015 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పోచారం, జమ్ము కాశ్మీర్ వ్యవసాయ శాఖ మంత్రి సజ్జాద్‌ అలీ తదితరులు హాజరయ్యారు.

11/25/2015 - 13:24

నల్గొండ: నడిగూడెం మండలం రత్తారం వద్ద సాగర్‌ ఎడమకాల్వకు గండి పడింది. దీంతో 200 ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఎడమకాల్వకు పడిన గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

11/25/2015 - 13:20

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌గా పి.ఉదయభాస్కర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయభాస్కర్‌ కాకినాడ జేఎన్‌టీయూ ఆచార్యులుగా పనిచేస్తున్నారు.

11/25/2015 - 13:17

హైదరాబాద్‌ : వరంగల్‌ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన పసునూరి దయాకర్‌ బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. దయాకర్‌తో పాటు వరంగల్‌ జిల్లా ముఖ్యనేతలు, ప్రచారంలో పాల్గొన్న మంత్రులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

11/25/2015 - 12:58

హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి మృతి చెందాడు. క్రాస్ రోడ్స్ వద్ద ఉదయం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న విశాల్ రెడ్డి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ రెడ్డి నగరంలోని కేఎమ్ఐటీ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

Pages