S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/13/2018 - 17:36

అమరావతి: సెంటిమెంట్‌తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి హోదా లేదంటూ ఈశాన్య రాష్ట్రాలకు పొడిగించలేదా? అని ప్రశ్నించారు. ఆనాడు బీజేపీ మద్దతివ్వకుంటే విభజన బిల్లు పాసయ్యేది కాదన్నారు.

03/13/2018 - 16:25

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడం స్పీకర్ ఏకపక్ష నిర్ణయమని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో జరిగిన ఉదంతంపై అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.

03/13/2018 - 15:59

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలైంది. దీన్ని స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఎమ్మెల్యేలకు మంగళవారం నోటీసులు పంపించింది. అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

03/13/2018 - 13:31

హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనపై స్పీకర్ మధుసూదనాచారి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సభలో అవాంఛనీయ ఘటనకు పాల్పడిన 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

03/13/2018 - 02:40

విజయవాడ, మార్చి 12: అవకతవకలు, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఇ-పోస్ యంత్రాలను చౌకడిపోల్లో అమర్చడం వల్ల ఒక్క ఏడాదిలోనే రూ.1500 కోట్లు ఆదా చేశామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

03/13/2018 - 02:04

రాజమహేంద్రవరం, మార్చి 12: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అడవుల్లో కార్చిచ్చులు చెలరేగకుండా ఉండటానికి రాష్ట్ర అటవీశాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని అడవుల్లో వేసవి కాలంలో చెట్లన్నీ ఆకులు రాల్చుతాయి. ఎండిన ఆకులు గుట్టలుగా పేరుకుపోయిన స్థితిలో కార్చిచ్చులు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటువంటి ప్రమాదాల నివారణకు అటవీ శాఖ వేసవి కార్యాచరణకు నడుంబిగించింది.

03/13/2018 - 02:01

విజయవాడ (పటమట) మార్చి 12: వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ కేసులు నుండి బయటపడటానికే బీజేపీతో లాలూచీ పడ్డారని చీఫ్‌విప్ పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.

03/13/2018 - 02:00

విజయవాడ, మార్చి 12: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎ.సూర్యకుమారిని పౌరసరఫరాల సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దుర్గగుడిలో తాంత్రికపూజల ఆరోపణల నేపథ్యంలో ఆమెను జీఏడీకి బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇప్పటి వరకూ ఎండీగా వ్యవహరిస్తున్న కె.రాంగోపాల్‌ను తదుపరి నియామకం కోసం జీఏడీకి బదిలీ చేసింది.

03/13/2018 - 01:29

కాకినాడ, మార్చి 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీవీ నాటక రంగ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవంలో భాగంగా రెండో రోజైన సోమవారం నాటి ప్రదర్శనలు అందరినీ అలరించాయి. స్థానిక యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ఆవరణలోని దంటు కళాక్షేత్రంలో ప్రముఖ నాటక పరిషత్‌లచే మూడు పద్య నాటకాలు ప్రదర్శించారు.

03/13/2018 - 01:16

హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా అంజనీకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న వివి శ్రీనివాసరావు నుంచి అంజనీకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. సిపి కార్యాలయంలో ఉన్న పోలీసు అధికారుల సమక్షంలో సంతకం పెట్టి బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల అదనపు డిజిగా ఉన్న అంజనీకుమార్ తాజా బదిలీల్లో ఆయనను హైదరాబాద్ సిపిగా ప్రభుత్వం బదిలీ చేసింది.

Pages