S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/12/2018 - 06:21

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువున్నందున సభలను వేదిక చేసుకునేందుకు పాలక, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించనున్నట్లు సమాచారం.

03/12/2018 - 06:19

హైదరాబాద్, మార్చి 11: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాష్ ముదిరాజ్ (వరంగల్) ఖరారయ్యారు. రెండు స్థానాలను బీసీ అభ్యర్థులకు కేటాయస్తూ తెరాస వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

03/12/2018 - 06:17

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్రంలో 38 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో డైరక్టర్ జనరల్ హోదాలో ఉన్న టి.కృష్ణప్రసాద్ రైల్వేపోలీస్ డీజీగా కొనసాగుతూ రోడ్డు భద్రత సంస్థ బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. ఈ బదిలీల్లో కృష్ణప్రసాద్‌ను రోడ్డు భద్రత సంస్థ డీజీగా బదిలీ చేసి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది.

03/12/2018 - 06:10

హైదరాబాద్, మార్చి 11: త్వరలోనే జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. తాను హైదరాబాద్‌లోనే ఉంటానని, అయినా జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. భారత రాజకీయాలకు అద్భుతమైన దిశా నిర్ధేశం చూపించి, ప్రజానికీకానికి మార్గ నిర్ధేశనం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.

03/12/2018 - 06:08

అమరావతి, మార్చి 11: టీడీపీ-బీజేపీ బంధం తెగిపోవడానికి కారణాలు, కమల దళపతి అమిత్‌షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సుజనాచౌదరి, కుటుంబరావు జరిపిన చర్చల వివరాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బయటపెట్టారు. ఆదివారం నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన నాటి చర్చల వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

03/11/2018 - 04:21

హైదరాబాద్: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈనెల 26న నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

03/11/2018 - 03:39

భద్రాచలం రూరల్, మార్చి 10: చత్తీస్‌గఢ్ అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఒక జవాన్ ఐఈడీ మందుపాతర పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీసు స్టేషన్ పరిధిలోని తోగ్గూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ఎస్టీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు అమర్చిన మందుపాతర (ఐఈడీ బాంబు)ను పసిగట్టలేకపోయిన సూరజ్‌మండలి అనే జవాను దానిపై కాలువేశాడు.

03/11/2018 - 04:08

హైదరాబాద్, మార్చి 10: బడ్జెట్ కేటాయింపులో ఆంధ్ర మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ధ్వజమెత్తారు. శనివారం ఆమె ఇక్కడ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, టిడిపి మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు అసలు, వడ్డీతో సహా పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

03/11/2018 - 02:41

హైదరాబాద్, మార్చి 10: మహిళల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మెగసిస్ అవార్డు గ్రహిత శాంతాసిన్హా అభిప్రాయపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ళ శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాంతా సిన్హా ప్రసంగిస్తూ మహిళలకు సమాజంలో సమానత్వం రావాల్సి ఉందన్నారు. మహిళలకు, పురుషులకు సరైన సమానత్వం రావాలని అన్నారు.

03/11/2018 - 02:22

కాకినాడ, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో ఆదివారం నుంచి రాష్టస్థ్రాయి నంది నాటకోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Pages