S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/31/2018 - 01:34

ఇల్లెందుల గోపీనాధ్

01/31/2018 - 01:32

హైదరాబాద్, జనవరి 30: సరళీకృత వ్యాపారం (ఈజ్ ఆఫ్ బిజినెస్), ఐపాస్ తదితర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు ముందు పూర్తిగా వెనుకబడి ఉన్న తెలంగాణ ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోందని వివరించారు.

01/31/2018 - 01:30

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సంస్కరణల్లో భాగంగా మరో పెద్దడుగు వేస్తోంది. పంచాయితీ రాజ్ చట్టం సంస్కరణల తరహాలో రాష్ట్రంలో మున్సిపాలిటీల పాలనా రంగంలో భారీఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల పాలనను ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది. దీనికోసం ఏకీకృత మున్సిపల్ చట్టాన్ని తేనుంది.

01/31/2018 - 01:26

విజయవాడ, జనవరి 30: విజయవాడలో భూకబ్జాల పర్వం తీవ్ర కలవరం రేపుతోంది. నగరం నడిబొడ్డున మాచవరంలోని ప్రఖ్యాత ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన రూ.300 కోట్ల విలువైన 7 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావటంతో మంగళవారం కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు ఆందోళనకు దిగారు. కబ్జాకు గురైన కళాశాల స్థలంలో నిర్మించిన గోడను విద్యార్థులు పడగొట్టారు.

01/31/2018 - 01:23

అమరావతి, జనవరి 30: ‘మనం ప్రజలకు కావలసిన అన్ని పనులు చేశాం. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తూనే ఉన్నాం. కానీ మీ ప్రవర్తన, పనితీరులోనే మార్పు రావాలి. మీరు మారారన్న సంకేతాలు కనిపించాలి. దానిని ప్రజలు గుర్తించాలి. మన ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి సానుకూలత ఉంది. దాన్ని ఓటుగా మలుచుకునే బాధ్యత మీదే. మీరుండే గ్రామాలతోపాటు, పార్టీ కూడా అభివృద్ధి చెందాలి. ఆ కోణంలో పనిచేయండి.

01/31/2018 - 01:21

విజయవాడ, జనవరి 30: లాస్‌ఏంజల్స్‌లో నిర్వహిస్తున్న పెట్టుబడుల రోడ్ షోలో భాగంగా మంగళవారం అక్కడి వివిధ తెలుగు కంపెనీల సీఈవోలతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మంత్రి గత కొద్ది రోజులుగా ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు అమెరికా వచ్చే తెలుగు వారికి నైపుణ్య శిక్షణ అందించాలని పిలుపునిచ్చారు.

01/31/2018 - 01:18

జాతిపిత గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు

01/31/2018 - 00:57

హైదరాబాద్, జనవరి 30: రైతులకు ఇచ్చే రుణాలను వ్యాపార కోణంలో చూడవద్దని, వారికి అండగా నిలవడమంటే దేశానికి సేవ చేయడమేనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇక్కడ మంగళవారం నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన ‘స్టేట్ క్రెడిట్ ప్లాన్’ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, టి హరీశ్‌రావు పాల్గొన్నారు.

01/31/2018 - 01:57

శ్రీశైలం ప్రాజెక్టు, జనవరి 30: దేశంలో మూడవ అతిపెద్ద హైడ్రాలిక్ ప్రాజెక్టు శ్రీశైలం డ్యాం దిగువన ఫ్లంజ్‌ఫుల్ వద్ద ఏర్పడిన గొయ్యి గురించి ప్రాజెక్టు అడుగున అధికారులు సర్వే చేపట్టారు. 1994లో ఈ గొయ్య 60 అడుగులుగా ఉందని నిపుణులు గుర్తించారు.

01/31/2018 - 00:51

విజయవాడ, జనవరి 30: విశాఖ నగరం గాజువాక పరిధిలో క్రమబద్ధీకరించిన స్థలాల క్రయవిక్రయాల కాలపరిమితిని రెండు సంవత్సరాలకు తగ్గించాలన్న స్థానిక ప్రజల విజ్ఞప్తికి మంత్రివర్గ ఉప సంఘం సానుకూలంగా స్పందించింది. క్రయవిక్రయాల కాలపరిమితిని తగ్గిస్తూ ప్రభుత్వానికి సిఫార్స్ చేయాలని అధికారులను ఆదేశించింది.

Pages