Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

మిమిక్రీ బర్డ్!

నెమలిజాతికి చెందినది కాకపోయినా ఈ పక్షి తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంటుం ది. ఆస్ట్రేలియా లోని కొన్ని ప్రాంతాలలో కనిపించే ఈ పక్షి పేరు లైర్‌బర్డ్. వీటిలో మగపక్షుల తోక చాలా అందమైన రంగులతో కనిపిస్తుంది. జతకట్టేందుకు ఆడపక్షులను ఆకర్షించేందుకు ఇవి నెమళ్ల మాదిరిగా పురివిప్పి ఆడుతుంది. అయితే వీటికి ఓ ప్రత్యేక లక్షణం ఉంది. ఏ శబ్దాన్నైనా ఇవి ఇట్టే అనుకరిస్తాయి. మిగతా పక్షులు, జంతువులు, చివరకు వాహనాల రొదనైనా సరే ఇవి పసిగట్టి అనుకరిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

ఒకాపీ నాలుక చాలా పొడవు!

చూడటానికి కాస్త గుర్రంలా కనిపిస్తున్నప్పటికీ ఒకాపీ జిరాఫీకి దగ్గరి బంధువు. వెనుక భాగం, కాళ్లపై జీబ్రాల మాదిరిగా చారలు ఉండటం వల్ల ఇది అందంగా కనిపిస్తుంది. కాంగోలో మాత్రమే కనిపించే ఒకాపీలకు జీబ్రాల మాదిరిగా మెడ కాస్త పొడవుగా ఉంటుంది. వీటి నాలుక దాదాపు 18 అంగుళాల పొడవుంటుంది. కళ్లు, చెవులను అది నాలుకతో శుభ్రం చేసుకోగలగడానికి అదే కారణం. ఒకప్పుడు 45వేల ఒకాపీలు ఉండేవి. అనేక కారణాలవల్ల వాటి సంఖ్య ఇప్పుడు 10వేలకు తగ్గిపోయిందట.

- ఎస్.కె.కె. రవళి

నీళ్లు తాగకుండా ఉండలేవు!

గుర్రాలు, గాడిదలకు దగ్గరి బంధువైన జీబ్రాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు జాతులను పెంచుకుని మనకు నచ్చినట్లు వాటితో పనులు చేయించుకోగలం. కానీ జీబ్రాలను అలా చేయలేం. సహజంగా అవి అడవుల్లో పెరగడంవల్ల అవి జనసామాన్యానికి అలవాటు పడలేదు. జీబ్రాలు నల్లని మేనితో ఉంటాయన్నది శాస్తవ్రేత్తల విశ్వాసం. వాటిపై తెల్లనిచారలవల్ల జీబ్రా అలా కనిపిస్తుందట. ఈ చారల సంఖ్య, వెడల్పు దేనికి దానికి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. మన వేలిముద్రల్లా.. జీబ్రాలు నీళ్లు లేకుండా మనుగడ సాగించలేవు. రోజుకు కనీసం ఒక్కమారైనా అవి నీళ్లు తాగాల్సిందే. అందుకే నీటి సదుపాయాలున్న చోటుకు అవి వలస వెడుతూంటాయి.

- ఎస్.కె.కె. రవళి

‘జెరోబా’ గెంతిందంటే...

నాలుగైదు అంగుళాలు కూడా లేని ‘జంపింగ్ రోడెంట్’ విభాగానికి చెందిన ‘జెరోబా’ సాధారణంగా ఒక అడుగుదూరాన్ని గెంతుతుంది. మామూలు ఎలకల్లా ఇవి నడవవు. కంగారూల మాదిరిగా గెంతుతూ వెళతాయి. అయితే భయపడినపుడు, శత్రువులనుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు దాదాపు పది అడుగుల దూరం వరకు గెంతి పారిపోతాయి. మంగోలియా, చైనా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపించే వీటి ముందరి కాళ్లు పొట్టిగా ఉంటాయి. వెనుకకాళ్లు ముందరికాళ్లకన్నా నాలుగైదు రెట్ల పెద్దవిగా ఉంటాయి. వీటి మొత్తం శరీరంకన్నా తోక చాలా పెద్దదిగా ఉంటుంది. గంటకు పదిహేను మైళ్ల వేగంతో ఇవి పరుగుపెట్టి తప్పించుకోగలవు.

జీడిపప్పు ఉత్పత్తిలో నైజీరియా గొప్ప!

ఆఫ్రికా దేశమైన నైజీరియా జీడిపప్పు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. నిజానికి ఆసియా దేశాలైన ఇండియా, చైనా, థాయ్‌లాండ్‌లలో జీడిపప్పును ఎక్కువగా వాడతారు. చాలా రకాల తీపి వంటకాల్లో ఇది లేకుండా చేయరు. నిజానికి జీడిపప్పులను అందించే జీడిమామిడికి బ్రెజిల్ పుట్టిల్లు. పోర్చుగీసు పర్యాటకుల పుణ్యమా అని ఇది మిగతా ప్రపంచానికి పరిచయం అయింది. తాజా పరిశోధనల ప్రకారం జీడిపప్పు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుందని తేలింది. అలాగే వీటిలో ‘బి’ గ్రూపు విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పప్పుల పైన ఉండే గట్టి పెంకుద్వారా వచ్చే అనకార్డిక్ యాసిడ్ కొందరికి పడదు. అన్నట్టు... ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.

- ఎస్.కె.కె. రవళి

దీని నోట్లో వందమంది పట్టేస్తారు!

ఈ భూగోళం మీద అతి పెద్ద ప్రాణి బ్లూవేల్. అప్పుడే పుట్టిన బ్లూవేల్ కనీసం పాతిక అడుగుల పొడవు ఉంటుంది. వయసువచ్చిన మగ బ్లూవేల్ పొడవు వంద అడుగులు, బరువు 150 టన్నులు ఉంటుంది. దీని నోరు అతిపెద్దదిగా ఉంటుంది. ఇది నోరు తెరిస్తే కనీసం వందమంది మనుషులు పట్టేస్తారు. హిప్పోపోటమస్ దీనికి దగ్గరి బంధువు. భూగోళంలోని ప్రాణుల్లో ఇది ఎంత పెద్దదైనప్పటికీ ఇది తినే ఆహారం మాత్రం అతి చిన్న జలచరాల్లో ఒకటైన ‘క్రిల్’. రొయ్యతరహాలో ఉండే ఈ జలచరాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వీటిని బ్లూవేల్ చేపలు ఎక్కువగా ఇష్టపడతాయి. ఇవి ఊపిరితిత్తులతో గాలి పీలుస్తాయి. వీటి తలపై ఉండే నాసికారంధ్రంలోంచి చిన్నపిల్లలు వెళ్లిపోవచ్చు.

చిన్నజీవులు.. గొప్ప రక్షణ

ఈ విశ్వంలో అనేక జీవుల భవితవ్యాన్ని, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుతున్నవి ఇతి చిన్నవైన ‘క్రిల్’ చేపలు. ఇవి రొయ్యల్లా కనిపిస్తాయి. కేవలం రెండున్నర అంగుళాల పొడవు మాత్రమే ఉండే వీటిపై ఎన్నో రకాల జీవులు ఆధారపడి ఉన్నాయి. సూర్యరశ్మి, ఐస్, మొక్కల ఆధారంగా బతికే ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. భారీ బ్లూవేల్ తిమింగలాల నుంచి షార్క్‌ల వరకు వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇవి లేకపోతే జీవరాశి, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటాయి. క్యూబిక్ మీటర్ విస్తీర్ణంలో పదివేల క్రిల్స్ ఉంటాయి. రోజుకు 4వేల టన్నుల క్రిల్స్‌ను ఒక బ్లూవేల్ తిమింగలం తింటుంది. ఆర్కిటిక్‌లోని ఐస్ క్రిల్ లార్వాలకు కీలకం.

- ఎస్.కె.కె. రవళి

ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతాలు ఎక్కువ!

మనుషులు నివసిస్తున్న చిట్టచివరి ప్రాంతం ఐస్‌లాండ్. ఆర్కిటిక్‌కు దగ్గరి ప్రాంతంలో ఈ దేశం ఉంది. ఇక్కడ అడవులు లేవు. దోమలు ఉండవు. ఒక మహిళ దేశంలో అత్యున్నత పదవిని నిర్వహించిన తొలిదేశంగా దీనికి ప్రపంచంలో గుర్తింపు ఉంది. మైనస్ డిగ్రీల చలిలోనూ ఇక్కడివారు ఐస్‌క్రీమ్ తినడాన్ని ఇష్టపడతారు. ప్రపంచంలో మిగతా అన్ని దేశాలవారికన్నా ఇక్కడి ప్రజలు ఎక్కువగా సినిమాలు చూస్తారు. పేరులో ఐస్‌లాండ్ అని ఉన్నప్పటికీ ఈ అతి చిన్న దేశంలో 125 అగ్ని పర్వతాలు ఉన్నాయి. వీటిలో దాదాపు పాతిక అగ్నిపర్వతాలు చాలా చురుకుగా ఉంటాయి. అంటే ఎప్పుడు సెగలు కక్కుతూంటాయన్నమాట.

గ్రీన్‌లాండ్‌లో ఉండేదంతా ఐస్!

ఆర్కిటిక్ ప్రాంతానికి అతి చేరువలే ఉండే ‘గ్రీన్‌లాండ్’ పేరును బట్టి అంతా పచ్చదనమే ఉంటుందనుకుంటే తప్పే. ఆ దేశంలో 99శాతం గడ్డకట్టిన మంచు, కదులుతున్న గ్లేసియర్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఈ దేశం చాలా పెద్దది. గ్రేట్‌బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, బెల్జియం దేశాలన్నీ కలిపినంత ఉంటుంది. ఈ దేశంలో ఐస్‌లేకుండా ఉండే అతికొద్ది ప్రాంతం డెన్మార్క్ అంత ఉంటుంది. ఇక్కడ రోడ్డురవాణా అసలు ఉండదు. నగరాల మధ్య రాకపోకలన్నీ వాయు లేదా జలమార్గాల్లోనే సాగుతాయి. ‘గ్రీన్‌లాండ్’ అంటే ‘ల్యాండ్ ఆఫ్ పీపుల్’ అని అర్ధం. ఇక్కడ మే 25 నుండి 25 వరకు సూర్యుడు అస్తమించడు. జూన్ 21 సుదీర్ఘ పగలు ఉన్న రోజు.

- ఎస్.కె.కె. రవళి

మైనస్ 60 డిగ్రీల చలిలోనూ బతికేస్తాయి!

ఎప్పుడో ఐదువేల ఏళ్ల క్రితం గ్రీన్‌లాండ్‌కు వచ్చిన ఈ శునకాలను ‘గ్రీన్‌లాండ్ డాగ్’ అని పిలుస్తారు. తోడేళ్ల లక్షణాలను పుణికిపుచ్చుకున్న వీటిని పెంచడం ఆషామాషీ కాదు. బలమైన, ధైర్యమైన యజమాని సంరక్షణలో మాత్రమే ఇవి చెప్పినమాట వింటాయి. యజమానికి వెనుక లేదా, పక్కనుంచి నడవటానికి ఇష్టపడతాయి. యజమానికన్నా ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లడానికి ఇష్టపడవు. ఎందుకంటే సహజంగా అవి తోటి శునకాల గుంపులో యజమానిని అనుసరించే గుణం కలిగి ఉంటాయి. గ్రీన్‌లాండ్‌కి వచ్చినా వాటి సహజలక్షణం అంతరించిపోలేదు. వీటికి ఒతె్తైన, దళసరి బొచ్చు ఉంటుంది. మైనస్ 60 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయినా అవి తేలిగ్గా తిరిగి బతుకుతాయి.

- ఎస్.కె.కె. రవళి

Pages