S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/15/2018 - 00:33

సిరిసిల్ల, డిసెంబర్ 14: టీఆర్‌ఎస్ అఖండ విజయం సాధించి పాలన పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై మళ్లీ సిరిసిల్ల పేరు మెరిసింది.

12/15/2018 - 00:24

హైదరాబాద్, డిసెంబర్ 14: పోషకాహార సంస్థలు, వ్యవసాయ పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు.హైదరాబాద్‌లో శుక్రవారం నాడు జరిగిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వందేళ్ల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనారోగ్యాల నుండి ప్రజలను కాపాడేందుకు పోషకాహారం విషయంలో సరికొత్త వ్యూహాలను అనుసరించాలని అన్నారు.

12/15/2018 - 00:24

హైదరాబాద్, డిసెంబర్ 14: అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం ఆపాలని, ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బీఎస్‌పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఈసీని కోరారు. ఈ మేరకు శుక్రవారం మల్‌రెడ్డి ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌ను కలిశారు.

12/15/2018 - 00:23

యాదగిరిగుట్ట, డిసెంబర్ 14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధి పనుల్లో భాగంగా గర్భాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన గడపకు శుక్రవారం గడప పూజ నిర్వహించారు. మరోవైపు త్వరలో స్వామివారి గర్భాలయానికి బిగించే టేకు ద్వారం పనులను పరిశీలించి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అర్చక బృందం సభ్యులు పాల్గొన్నారు.

12/15/2018 - 00:15

హైదరాబాద్, డిసెంబర్ 14: నాయకుడంటే మాటలు చెప్పేవాడు కాదు. శుష్కవాగ్దానాలతో జనాన్ని మభ్యపెట్టేవాడు అంతకంటే కాదు. నిన్నటి రాజకీయం వేరు. నవతరం ఆశిస్తున్న ప్రజానాయకత్వం వేరు. నాయకత్వానికి విజ్ఞత, దూరదృష్టి తోడైతే.. దానికి సమర్థత సానపెడితే ఇక ఎదురేముంటుంది. ఎంతటి బృహత్కార్యమైనా కరతలామలకమే..ఎంతటి సవాలైనా తృణప్రాయమే.అన్నింటా తానై.. అన్నీ తానై రాణించే నాయకులు అరుదుగా ఉంటారు.

12/15/2018 - 00:15

హైదరాబాద్, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారక రామారావు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కేటీఆర్ నియామకాన్ని పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.

12/15/2018 - 00:13

హైదరాబాద్, డిసెంబర్ 14: సమర్థులకే ఈసారి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది.

12/15/2018 - 00:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యులైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని తక్షణం పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాకే పలువురు బాధ్యులను తప్పించి కొత్తవారిని నియమించాలని ఆయన కోరారు.

12/15/2018 - 00:11

హైదరాబాద్, డిసెంబర్ 14: శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ పార్టీ తన ఓటమిగల కారణాలపై పోస్టుమార్టం మొదలు పెట్టింది. కారణాలను విశే్లషించి పార్టీ అధిష్టానికి నివేదించడానికి కసరత్తు చేస్తోంది.

12/14/2018 - 17:14

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా కేటీఆర్ నియామకంపై సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హార్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కేటీఆర్ కలిశారు.

Pages