S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/14/2018 - 00:18

హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయని ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు ఏమి లేవని, పాత విషయాలనే తిరిగి చదివించారని అన్నారు.

03/14/2018 - 00:17

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలను ప్రశాంతగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్య కమిషనర్ జి కిషన్, పరీక్షల డైరెక్టర్ బి సుధాకర్ తెలిపారు. వారు మంగళవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులకు సైతం వారు పలు సూచనలు చేశారు.

03/14/2018 - 00:16

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పురాణం సతీష్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు ఆర్టీసీ నష్టాలు, అందుకు గల కారణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానంగా ఇచ్చారు.

03/14/2018 - 00:16

హైదరాబాద్, మార్చి 13: ప్రస్తుతం ఐదు వేల కోట్లుగా ఉన్న బీసీ బడ్జెట్‌ను రూ.10వేల కోట్లకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఇటీవల బీసీ డిక్లరేషన్ సందర్భంగా అంగీకరించిన డిమాండ్లకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని కోరారు.

03/14/2018 - 00:15

హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన జాజుల భాస్కర్ నామినేషన్ తిరస్కరించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో బరిలో అధికార టిఆర్‌ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి బలరామ్ నాయక్ మిగిలారు.

03/14/2018 - 00:03

హైదరాబాద్, మార్చి 13: రాజ్యాంగ పరిరక్షకుడినే లక్ష్యంగా చేసుకొని దాడి చేసామన్న వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పేమి లేదని శాసనసభ వ్యివహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్‌పై దాడికి దిగి, మరో అత్యున్నత పదవిలో ఉన్న శాసనమండలి చైర్మన్‌పై దాడి చేస్తే చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటామని మంత్రి ప్రశ్నించారు.

03/13/2018 - 23:52

హైదరాబాద్, మార్చి 13: జర్నలిస్తులక్ఘ్ఘు ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరంగల్ వెళ్లినపుడు చెప్పారని కాని నాలుగేళ్లయినా ఆ ఊసే లేదని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు శాసనసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆరు నెలల్లో గృహప్రవేశాలు చేస్తారని, అందరం కలిసి భోజనం చేద్దామని సిఎం పేర్కొన్నారని ఇపుడు ఆ అంశం గురించి సిఎం మాట్లాడటం లేదని ఆరోపించారు.

03/13/2018 - 23:52

హైదరాబాద్, మార్చి 13: హైకోర్టు విభజనకు కేంద్రంపై వత్తిడి తీసుకువస్తామని న్యాయశాఖా మంత్రి ఎ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంగళవారం నాడు మంత్రి శాసనసభలో సమాధానం చెప్పారు.

03/13/2018 - 23:50

హైదరాబాద్, మార్చి 13: అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న సెగ మంగళవారం ప్రారంభం అయిన మండలికి పాకింది. సభ ప్రారంభం అయిన పది నిమిషాల్లోపే ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు సభ్యులను సస్పెండ్ చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు.

03/13/2018 - 23:49

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దుచేయడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం నిరంకుశ చర్య అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిత్యం పోడియం చుట్టిముట్ట అలజడి అలజడి సృష్టిస్తున్నా, స్పీకర్, ప్రభుత్వం సభ్యులపై చర్యలకు దిగడం లేదన్నారు.

Pages