S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/13/2018 - 23:48

హైదరాబాద్, మార్చి 13: శాసనసభలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వ రద్దుపై చక చక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉప ఎన్నిక నిర్వహించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఆ దిశగా ఇద్దరు సభ్యుల సభ్యత్వ రద్దు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

03/13/2018 - 23:46

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ డయాగ్నస్టిక్స్ కింద హబ్ , స్పోక్ విధానంలో పౌరులందరికీ ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. శాసనసభలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ ఇంత వరకూ కేంద్రం స్థానంగా హైదరాబాద్‌లో ఒక సెంట్రల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని అన్నా రు.

03/14/2018 - 04:05

హైదరాబాద్: హుందాగా వ్యవహరించే ప్రతిపక్ష నేత కె జానారెడ్డిని శాసనసభ నుండి సస్పెండ్ చేయడం సబబుగా లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి మంగళవారం నాడు శాసనసభలో పేర్కొన్నపుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు, కిషన్‌రెడ్డికి తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నపుడు జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, అలాంటి సంఘటనలకు చట్టసభల్లో స్థానం ఉండకూడదని అన్నారు.

03/14/2018 - 00:00

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణలో కే. చంద్రశేఖరరావు పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శాసనసభలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వ ర్ పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ సోమవారం చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని మంగళవారం ఆయన సభలో ప్రతిపాదించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ తీర్మానాన్ని బలపరిచారు.

03/13/2018 - 23:57

హైదరాబాద్, మార్చి 13: జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా తెలంగాణ రాష్ట్రం మారబోతోందని అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో యుపిఎ, ఎన్‌డిఏ కూటములు పరిపాలనలో విఫలం చెందాయని, ఈ తరుణంలో మరొక కూటమి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

03/14/2018 - 00:02

హైదరాబాద్, మార్చి 13: ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల సందర్భంగా ప్యానెల్ స్పీకర్ల జాబితాను స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చ పూర్తయిన తర్వాత ఒక ప్రకటన చేశారు. ముగ్గురిని ప్యానెల్ స్పీకర్లుగా ప్రకటించారు. బాజిరెడ్డి గోవర్దన్, డిఎస్ రెడ్యానాయక్, కొండా సురేఖలు ప్యానెల్ స్పీకర్లుగా వ్యవహరిస్తారని వివరించారు.

03/13/2018 - 22:15

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల మధ్య మంగళవారం విత్తనాల సరఫరాకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం జరిగింది.

03/14/2018 - 00:58

హైదరాబాద్/ సిరిసిల్ల, మార్చి 13: సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపెరల్ పార్క్ సూపర్ హబ్ ఏర్పాటుకానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేఏవై వెంచర్స్ మధ్య సచివాలయంలో మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా చేనేత మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 100 కోట్లతో సూపర్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 15 వేల మందికి,

03/13/2018 - 22:11

హైదరాబాద్, మార్చి 13: కల్లుగీత వృత్తికి ప్రభుత్వం అండగా నిలవడానికి అనేక చర్యలు తీసుకోబోతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు కల్లుగీతా కార్మికులు, గౌడ కులస్థుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసిందన్నారు. శాసనసభ కమిటీ హాల్‌లో మంత్రులు హరీశ్‌రావు, పద్మారావుగౌడ్, జోగురామన్న నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సమావేశమైంది.

03/13/2018 - 22:09

హైదరాబాద్, మార్చి 13: పట్టణాల పురోగతికి తెలంగాణ నగర ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషననర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. పట్టణాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు.

Pages